ఆదివారం(మార్చి 19)న పుట్టిన రోజు జరుపుకుంటున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఈ సందర్భంగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమా కెరీర్ లో ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చాడు. తనకు వచ్చిన కష్టాలు పగవాడికి కూడా రాకూడదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
సినిమా ఇండస్ట్రీలో నెగ్గుకురావడం అంత ఆశామాషీ వ్యవహారం కాదు. అదీకాక పరిశ్రమలో అవకాశాల కోసం తిరిగే సమయంలో అయితే ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొవాల్సి వస్తుంది. అన్ని అవమానాలను, చీత్కారాలను ఎదుర్కొని వచ్చిన వాడే పరిశ్రమలో నిలదొక్కుకోగలుగుతాడు. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా కొంత మంది నటీ, నటులు అధమ స్థాయిలోకి వెళ్తుంటారు. తాజాగా విలక్షణ నటుడు మోహన్ బాబు సైతం తాను సినీ కెరీర్ లో ఎదుర్కొన్న ఇబ్బందులను చెప్పుకొచ్చాడు. ఆదివారం మోహన్ బాబు 71వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో సుమన్ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో తనకు సినీ కెరీర్ లో ఎదురైన అనుభవాను చెప్పుకొచ్చాడు. తనకు వచ్చిన కష్టాలు పగవాడికి కూడా రాకూడదు అని అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
మోహన్ బాబు.. టాలీవుడ్ లో విలక్షణ నటుడు ఎవరు అంటే ఠక్కున్న గుర్తుకువచ్చే పేరు. తనదైన విలనిజంతో, హీరోయిజంతో.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్రను వేసుకున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఎక్కడో రాయలసీమలోని మారుమూల గ్రామం నుంచి ఇండస్ట్రీకి వచ్చిన పరిశ్రమలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. 1970లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పరిశ్రమలోకి అడుగుపెట్టి.. తనదైన నటనతో.. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా, నిర్మాతగా, విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగా అన్ని రంగాల్లో తనదైన ముద్రవేసుకున్నారు. సినిమాలపై ఉన్న ప్రేమతో లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ ను స్థాపించి 50కి పైగా చిత్రాలను నిర్మించారు. అటు శ్రీవిద్యానికేతన్ సంస్థల అధినేతగా ఎంతో మంది పేద విద్యార్థులకు చదువు చెప్పిస్తూ.. అండగా నిలుస్తున్నారు.
మరి ఇంతటి చరిత్ర ఉన్న మోహన్ బాబు సైతం ఇండస్ట్రీలో కష్టాలు పడ్డారు అని మీకు తెలుసా? ఈ క్రమంలోనే ఆదివారం(మార్చి19)న మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన సుమన్ టీవీకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్ లో ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చాడు. మోహన్ బాబు మాట్లాడుతూ..”మీకు నేను పైకి బాగానే కనిపించవచ్చు. కానీ నా సినిమా కెరీర్ లో ఎదురైన ఇబ్బందుల వల్ల నా ఇల్లు కూడా అమ్ముకున్నాను. అయితే అప్పుడు ఏ ఒక్కరు కూడా నాకు సాయం చేయలేదు. వాటితో పాటుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈ స్థాయిలో ఉన్నాను. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది.. నా కష్టాలు పగవాడికి కూడా రాకూడదు అని” అంటూ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి పేర్కొన్నాడు మోహన్ బాబు.
ఇక ఈ మధ్య కాలంలో వచ్చిన సన్నాఫ్ ఇండియా. జిన్నా సినిమాలు పరాజయం పాలైన విషయాన్ని అంగీకరించారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఇంటర్వ్యూలో రాజకీయ, చిరంజీవి, తనకు వివాదాలకు సంబంధించిన విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. మోహన్ బాబు 1952 మార్చి 19న చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మోదుగులపాలెంలో జన్మించారు. దాసరి నారాయణరావు తెరకెక్కించిన ‘స్వర్గం-నరకం’ సినిమా ద్వారా మోహన్ బాబు నటుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి విలక్షనమైన కంచు కంఠంతో.. ఇండస్ట్రీని షేక్ చేస్తూ.. స్టార్ యాక్టర్ గా ఎదిగారు. మరి మోహన్ బాబు ఇండస్ట్రీలో ఎదుర్కొన్న ఇబ్బందులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.