తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో వందల సంఖ్యలో సినిమాలు చేశారు. ప్రస్తుతం మంచి మంచి పాత్రలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. లియో సినిమా పాట..
మన్సూర్ అలీ ఖాన్.. ఈ పేరు చెబితే గుర్తు పట్టడం కొంచెం కష్టం కానీ.. ఆయన్ని చూస్తే మాత్రం మీరు ఇట్టే గుర్తు పట్టేస్తారు. 61 ఏళ్ల ఈ నటుడు దాదాపు 33 ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో వందల సంఖ్యలో సినిమాలు చేశారు. ప్రస్తుతం మంచి మంచి పాత్రలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన నటిస్తున్న ‘లియో’ సినిమా మరికొద్దిరోజుల్లో విడుదల కానుంది. దళపతి విజయ్ పుట్టిన రోజు సందర్భంగా లియోకు సంబంధించిన ఓ పాటను సినిమా టీం విడుదల చేసింది. ఈ పాట కారణంగా మన్సూర్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు.
మన్సూర్ చేసిన పని కారణంగా ఆయనపై పోలీస్ కేసు నమోదయ్యే అవకాశం కూడా ఉంది. అసలు సంగతి ఏంటంటే.. మన్సూర్ కొద్దిరోజుల క్రితం తన కారును డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటికి వెళుతున్నారు. ఆ సమయంలో కారులో లియో పాట ‘నమ్మ రూల్స్’ను ఎక్కువ సౌండ్ ప్లే చేసి వింటూ ఉన్నారు. డ్రైవింగ్ చేస్తూనే పాట బీట్‌కు తగ్గట్టు ఒళ్లు కదుపుతూ ఊగిపోయారు. దీన్ని వెనకాల సీటులో కూర్చున్న వ్యక్తి వీడియో తీశాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ నీకు అసలు బుద్ధిలేదా.. డ్రైవింగ్ చేస్తూ అలా డ్యాన్స్ చేస్తావా?’’.. ‘‘ సెలెబ్రిటీవి అయి ఉండి ఏంటా పిచ్చిపనులు’’.. ‘‘ మన్సూర్ సార్.. మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి మన్సూర్ చేసిన పని ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధం. ఈ పాయింట్ మీద ఆయన మీద కేసు ఫైల్ చేసే అవకాశం కూడా ఉంది. మరి, ట్రాఫిక్ అధికారులు దీనిపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.