హృతిక్ రోషన్.. అమ్మాయిల కలల రాకుమారుడిగా, బాలీవుడ్ స్టైలిష్ హీరోగా.. అందరికి తెలుసు. అంతకంటే ఎక్కువ దిగ్గజ దర్శక, నిర్మాత అయిన రాకేష్ రోషన్ కొడుకుగా దేశవ్యాప్తంగా సుపరిచితమే. బాలీవుడ్ లో ఎందరో స్టార్ హీరోలు ఉన్నప్పటికీ హృతిక్ రోషన్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. పుట్టుకతోనే గోల్డెన్ స్ఫూన్ తో పుట్టిన హృతిక్.. సినిమాల్లో నిలదొక్కుకోవడం కోసం చాలా కష్టపడ్డాడు. తండ్రి బాలీవుడ్ లో స్టార్ నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తనదైన ముద్ర వేశాడు. తండ్రి నుంచి నటనా వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న హృతిక్.. తండ్రికి తగ్గ తనయుడిగా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు.
సాధారణంగా తమ అభిమాన నటుడికి సంబంధించిన చాలా విషయాలను ఫ్యాన్స్ తెలుసుకోవాలి అనుకుంటారు. ఇలా తెలుసుకోవాలి అనుకునే వాటిల్లో ముఖ్యమైనవి.. ఆ హీరో ఏ కార్లు, ఏ బైక్ లు వాడుతున్నాడో తెలుసుకోవాలన్న ఉత్సుకత ప్రతీఒక్క అభిమానిలో ఉంటుంది. మరి అమ్మాయిల కలల రాకుమారుడు అయిన బాలీవుడ్ అందగాడు హృతిక్ రోషన్ ఎంత లగ్జరీ కార్లు వాడుతున్నాడో తెలుసుకోవాలిని ఏ ఫ్యాన్ కు ఉండదు చెప్పండి. అందుకే ఈ రోజు హృతిక్ ఎలాంటి కార్లను ఉపయోగిస్తాడో తెలుసుకుందాం పదండి.
రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ II
ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన, ఖరీదైన కార్లను తయారు చేసే సంస్థ రోల్స్ రాయిస్. చాలా మంది సెలబ్రిటీలు దీనిని కొనుగోలు చేయాలని కలలు కంటుంటారు. అయితే తన 42వ బర్త్ డే సందర్భంగా హృతిక్ ‘రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ II’ కారును కొనుగోలు చేశాడు. ఈ కారు గంటకు 250 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది. అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన దీని ధర భారతీయ మార్కెట్లలో స్టార్టింగ్ నుంచే రూ.7 కోట్లుగా ఉంది. హృతిక్ తో పాటు ముఖేష్ అంబానీ లాంటి మరికొంత మంది పారిశ్రామికవేత్తల దగ్గరే ఈ రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ II కార్లను కలిగి ఉన్నారు.
మెర్సిడెస్ మేబాచ్ S600
మెర్సిడెస్ బెంజ్.. కార్ల గురించి కొద్దొగొప్పో తెలిసిన వారికి ఈ పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. మెర్సిడెస్ బెంజ్ భారతదేశంలో అత్యంత ప్రజాదారణ పొందిన కార్ల కంపెనీ. మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి సంబంధించిన ‘మేబాచ్ S600’లగ్జరీ కారు హృతిక్ గ్యారేజీలో ఉంది. ఈ కారును హృతిక్ రోషన్ 2016లో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీని ధర సుమారు 2.65 కోట్లు ఉంటుందని అంచనా. అత్యంత ఆధునికమైన డిజైన్లు మేబాచ్ సొంతం. ఈ కారులో హీటెడ్, కోల్డ్ మసాజ్ సీట్లతో పాటుగా ఫోటో క్రొమాటిక్ రూప్ లాంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.
మినీ కూపర్ కన్వర్టిబుల్
హృతిక్ రోషన్ సాధారణంగా రోజూవారి ప్రయాణానికి ఉపయోగించే కార్లలో మినీ కూపర్ కన్వర్టిబుల్ ఒకటి. చాలా సార్లు తన కొడుకులతో కలిసి ఈ కారులో ప్రయాణించాడు హృతిక్. అదీకాక నగరాలకు సరిగ్గా సరిపోయే ఫీచర్లు ఉన్న కారు ఇది. అందుకే ఎక్కువ మంది మినీ కూపర్ కన్వర్టిబుల్ రేంజ్ రోవర్లను కొనుగోలు చేస్తుంటారు.
ఫెరారీ 360 మోడెనా
ఇవే కాక ఈ బాలీవుడ్ స్టైలిష్ హీరో దగ్గర మరికొన్ని కార్లు సైతం ఉన్నాయి. ఫెరారీ 360 మోడెనా కారు అతడి దగ్గర ఉంది. అత్యంత ఖరీదైన కార్లను తయారుచేసే సంస్థలో ఫెరారీ ఒకటి అని మనందరికి తెలుసు. ఇండియాలో ఈ మోడల్ కారును కొనుగోలు చేసిన రెండో వ్యక్తి హృతిక్ కావడం విశేషం. ఇక మెుదటి వ్యక్తి వచ్చి ఇండియాన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్. ప్రస్తుతం ఇది కాస్ట్లీ వింటేజ్ కారుగా మారిపోయింది. ఈ మోడల్ ధర వచ్చేసి భారత మార్కెట్ లో రూ. 80 లక్షలుగా ప్రారంభ ధర ఉంది.
అయితే హృతిక్ దగ్గర ఉన్న అత్యంత విలువైన, ఐకానిక్ కారు ఒకటి ఉంది. దానిపేరే ‘ఫోర్డ్ ముస్టాంగ్’ ఇది 1966 కాలం నాటి అత్యంత అరుదైన కారు. 2000వ సంవత్సరంలో అతడు ఈ కారును కొనుగోలు చేశాడు. ఇక దీని ధర వచ్చేసి ఆ కాలంలోనే రూ. 2 కోట్లు ఉన్నట్లుగా సమాచారం. వీటితో పాటుగా ఆస్టన్ మార్టిస్ రాపిడ్ ఎస్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్, ఆడి లాంటి మరెన్నో ఖరీదైన కార్లు హృతిక్ గ్యారేజ్ లో ఉన్నాయి. మరి ఇన్ని లగ్జరీ కార్లు కలిగిన హృతిక్ రోషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.