సాధారణంగా సెలబ్రిటీలు అందరూ హైఫైగా, లగ్జరీగా, కంఫర్ట్ గా ఉండే కారుని కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. అందుకు కాస్త ఖర్చు ఎక్కువ అయినా కూడా వెనుకాడరు. అలాంటి ఒక కేటగిరీలో ఇప్పుడు టయోట కంపెనీ నుంచి వెల్ ఫైర్ అనే కారు పేరు బాగా వినిపిస్తోంది. అసలు ఎందుకు సెలబ్రిటీలు ఆ కారుని కొనుగోలు చేస్తున్నారు?
టయోటా వెల్ ఫైర్.. ఈ లగ్జరీ కారు పేరు తాజాగా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందరూ ఈ కారు గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ కారు కొనుగోలు చేశారు. పైగా ఈ కారుకి ఫ్యాన్సీ నెంబర్ కోసం అక్షరాలా రూ.4.7 లక్షలు ఖర్చు చేశారు. అయితే మీరు గమనిస్తే.. ఇప్పుడు సెలబ్రిటీలు అందరూ ఈ కారునే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఏదైనా లగ్జరీ కారు, ఫ్యామిలీతో వెళ్లడానికి కూడా కంఫర్ట్ గా ఉండాలి అనుకుంటే ఈ వెల్ ఫైర్ బెస్ట్ ఆప్షన్ గా భావిస్తున్నారు. అయితే ఈ కారు ధర కూడా అంత తక్కువేం కాదులెండి. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ రూ. 96.55 లక్షలుగా ఉంది. ఇంక ఆన్ రోడ్ మీకు రూ.కోటీ 10 లక్షల వరకు ఉంటుంది.
ఇప్పుడు అందరూ అనుకుంటున్నది ఏంటంటే.. అసలు ఈ టయోటా వెల్ ఫైర్ కారుని ఎందుకు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు? అందులో అంత స్పెషల్ ఉందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిజానికి టయోటా వెల్ ఫైర్ కచ్చితంగా స్పెషల్ కారనే చెప్పాలి. ఎందుకంటే ఇది లగ్జరీ కార్లలో బడ్జెట్ కారని చెప్పచ్చు. ఎంతో స్పేషియస్ గా, ప్రయాణం చేసేందుకు ఎంతో కంఫర్ట్ గా ఉంటుంది. ఎక్స్ పీరియన్స్ మాత్రం నెక్ట్స్ లెవల్ ఉంటుందని తప్పకుండా చెప్పచ్చు. గతంలో అయితే సెలబ్రిటీలు బెంజ్ వీ క్లాస్ కార్లను కొనుగోలు చేసేవారు. కానీ, ఇప్పుడు అంతా వెల్ ఫైర్ వైపే మొగ్గు చూపుతున్నారు. గతంతో పోలిస్తే.. హైదరాబాద్ లో వెల్ ఫైర్ కార్లు 20 శాతం వరకు పెరిగినట్లు చెబుతున్నారు.
ఇంక ఈ టయోటా వెల్ ఫైర్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. ఈ కారు దాదాపు 5 మీటర్ల పొడవు ఉంటుంది. దీనిలో పెట్రోల్+ విద్యుత్ రెండూ ఒకే కార్ లో ఉంటాయి. ఇంకో వింతేంటంటే.. కారు ఆటోమేటిక్ గా ఛార్జ్ కూడా అవుతుంది. ఇది 2494 సీసీ గాసోలిన్ హైబ్రిడ్ ఇంజిన్ తో వస్తోంది. దీనిలో రెండు మోటార్స్ ఉంటాయి. ఫ్రంట్ మోటర్ 105 కిలోవాట్స్, రేర్ మోటర్ 50 కిలోవాట్స్ కెపాసిటీతో వస్తోంది. ఇందులో నికెల్ మెటల్ హైబ్రిడ్ బ్యాటరీస్ ఉటాయి. 360 డిగ్రీస్ లో కెమెరాస్ వస్తాయి. సేఫ్టీ పరంగా ఇందులో 7 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. వెహికిల్ స్టెబిలిటీ కంట్రోల్, బ్రేక్ హోల్డ్, ఏబీఎస్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ కారులో డోర్ ఓపెనింగ్ దగ్గర నుంచి సీట్ అడ్జస్ట్ మెంట్ వరకు అన్నీ ఆటోమేటిక్ గా చేసుకోవచ్చు. హెడ్ ల్యాంప్స్, వైపర్స్ కూడా ఆటోమేటిక్ గా వర్క్ అవుతాయి. ఇన్ని కంఫర్ట్, సేఫ్టీ, లగ్జరీ ఫీచర్స్ ఉన్నాయి. కాబట్టే ఇప్పుడు సెలబ్రిటీలు అందరూ ఈ వెల్ ఫైర్ కారుని కొనుగోలు చేయడానికే ఇష్టపడుతున్నారు.