సినీ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు, నిర్మాత రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. చిన్న కొరియోగ్రాఫర్ గా అడుగు పెట్టిన లారెన్స్ ఇప్పుడు స్టార్ హీరోగానే కాదు.. దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. లారెన్స్ తెరకెక్కించిన కాంచన సీరీస్ ప్రేక్షకులను భయపెట్టడమే కాదు.. కడుపుబ్బా నవ్వించాయి. ఈ మూవీస్ తో లారెన్స్ కి మంచి క్రేజ్ వచ్చింది.
లారెన్స్ కేవలం నటుడిగానే కాకుండా.. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎంతో మంది పిల్లలకు గుండె చికిత్స తన ఫౌండేషన్ తరపున చేయించారు, ఎంతో మంది అనాథలకు ఆశ్రయం కలిపించారు. అదే విధంగా ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిసినా వెంటనే స్పందించి సాయం అందిస్తుంటారు. లారెన్స్ చేస్తున్న సేవలను గుర్తించిన మానవ హక్కుల సంఘం.. అంతర్జాతీయ నేర నిరోధక సంస్థతో కలిసి గౌరవ డాక్టరేట్ ప్రకటించాయి. ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమం ఆదివారం చెన్నైలో జరిగింది.
కతిరేసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రుద్రుడు’ మూవీ షూటింగ్ లో ఉండటం వల్ల లారెన్స్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. లారెన్స్ కి బదులుగా ఆయన మాతృమూర్తి హాజరై గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. లారెన్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు డాక్టరేట్ రావడం అభిమానులకు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
It is a great honour for me to receive the doctorate award for social service. Heartfelt thanks to International Anti- corruption and human rights council for honouring me with this award. It’s special to me because my mother received this award on behalf of me @iachrc_Official pic.twitter.com/WM2hDLrBrj
— Raghava Lawrence (@offl_Lawrence) July 11, 2022