తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు బ్రహ్మాజీ ‘ది వారియర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా.. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ప్రముఖ దర్శకులు లింగు స్వామి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన ‘ది వారియర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బ్రహ్మాజీ మాట్లాడుతూ.. రన్ మూవీ చూసినప్పటి నుంచి లింగు స్వామికి పెద్ద ఫ్యాన్ అయ్యాను. ఆయన డైరెక్షన్ అంటే ఎంతో ఇష్టం అన్నారు. చిట్టూరి శ్రీనివాస్ తో మంచి పరిచయం ఉంది.. తాను రామ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసి ఆఫీస్ కి వెళ్లి కలిశానని అన్నారు. లింగు స్వామి ప్రత్యేకత ఏంటంటే.. తెలుగు, తమిళ భాషల్లో సినిమా తీస్తే తమిళంలో వేరే ఆర్టిస్టును తీసుకుంటారు కానీ తమిళంలో కూడా నాతో రోల్ చేయించారని అన్నారు.
ఇక రామ్ గురించి మాట్లాడుతూ.. ఈ మూవీలో రామ్ పెర్ఫార్మెన్స్ చూసి ఫ్యాన్ అయ్యానని అన్నారు. తెలుగులో డైలాగులు ఎంత బాగా చెప్పాడో, తెలుగు కన్నా తమిళంలో అద్భుతంగా డైలాగులు చెప్పాడంటూ ప్రశంసించారు. అంతేకాదు.. తమిళంలోనూ ప్రతీ సీన్ సింగిల్ టేక్ లో చేశాడని, రామ్ లాంటి స్టైలిష్ నటుడు బాలీవుడ్ లో ఉండాల్సింది.. అయితే మన అదృష్టం తెలుగు లో కొనసాగుతున్నాడు. రియల్లీ వెరీ టాలెంటెడ్ అని బ్రహ్మాజీ అన్నారు.
ఇక తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ‘ది వారియర్’ మూవీ జూలై 14న రిలీజ్ కాబోతుంది. ఈ మూవీలో రామ్ మొదటిసారిగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండడం, లింగుస్వామి డైరెక్షన్ లో వస్తుండడంతో ఈ మూవీపై అంచనాలు బాగా పెరిగాయి. రన్, పందెం కోడి, ఆవారా, సికిందర్ వంటి డబ్బింగ్ సినిమాలతో ఆకట్టుకున్న లింగుస్వామికి తెలుగులో ఇదే మొదటి స్ట్రైట్ మూవీ.
ఇక ఈ మూవీలో హీరోయిన్ గా కృతిశెట్టి నటిస్తుండగా, విలక్షణ నటుడు ఆది పినిశెట్టి గురు అనే నెగిటీవ్ పాత్రలో నటిస్తున్నారు. తెలుగులో తన ఎనర్జీతో తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకున్న హీరో రామ్, తమిళంలోనూ తన సత్తా చాటాలని ఆశిద్దాం. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: Lawrence: రాఘవ లారెన్స్ కు గౌరవ డాక్టరేట్!