టాలీవుడ్‌లో అందరూ మెచ్చేవాడు.. హిలేరియస్ డైలాగ్స్‌తో నవ్వించే నటుడు బ్రహ్మాజీ. గులాబీ సినిమాలో విలన్ పాత్రలో మెప్పించి, నిన్నే పెళ్లాడతా వంటి చిత్రాల్లో కనిపించాడు. సిందూరంతో హీరోగా మారిన బ్రహ్మజీ..
టాలీవుడ్‌లో అందరూ మెచ్చేవాడు.. హిలేరియస్ డైలాగ్స్‌తో నవ్వించే నటుడు బ్రహ్మాజీ. గులాబీ సినిమాలో విలన్ పాత్రలో మెప్పించి, నిన్నే పెళ్లాడతా వంటి చిత్రాల్లో కనిపించాడు. సిందూరంతో హీరోగా మారిన బ్రహ్మజీ.. ఆ తర్వాత పలు సినిమాల్లో కనిపించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు కమెడియన్‌గా, బిజీయెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయారు. ఆయన ట్వీట్లు నవ్వులు తెప్పిస్తుంటాయి. వేదికలపై ఆయన మాట్లాడుతున్నాడంటే చాలు నవ్వులు పువ్వులు పూస్తాయి. ఆయనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఏ విషయానైన్నా సెటెరికల్ గా హ్యాండిల్ చేస్తుంటారు. కానీ ఆయన చేసిన ఓ ట్వీట్ పెను దుమారం రేపింది. ఏకంగా ఆయనకు వ్యతిరేకంగా ట్వీట్ల వర్షం కురిసింది. దీనిపై ఆయన తాజాగా వివరణ ఇచ్చారు.
బ్రహ్మజీ కుమారుడు సంజయ్ రావ్ హీరోగా నటిస్తున్న చిత్రం స్లమ్ డాగ్ హస్బెండ్. ఈ సినిమా విడుదల సందర్భంగా పలు సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు బ్రహ్మాజీ. ఈ సందర్భంగా గతంలో ఓ సారి బోటు కొనాలనుకుంటున్నాను.. సూచనలు ఇవ్వండి అని ట్వీట్ చేశారు. దీనిపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ఎందకు, ఏ పరిస్థితుల్లో తాను ఏ ట్వీట్ చేయాలో చెప్పాడు బ్రహ్మజీ. ‘ఇటీవల హైదరాబాద్‌లో వర్షాలు కురిశాయి. భారీ వర్షం కురిసింది. నేను నా భార్యలో కారులో ఉన్నాం. ఇంటికి వెళ్లే దారులన్నీ నీటితో నిండిపోయాయి. దగ్గరలో తెలిసిన వారింట్లో కారు పార్క్ చేసి పక్కనే ఉన్న వంతెన మీదుగా మా ఇంటికి చేరుకున్నాం. ఆ సమయంలో అక్కడ ఉన్న స్థానికులు మాకు సాయం చేశారు‘ అని తెలిపారు.
ఇదే విషయాన్ని తాను కాస్త సెటైరికల్‌గా బోట్ కొనాలనుకుంటున్నానని, అభిప్రాయాలు కోరానన్నారు బ్రహ్మాజీ. దానికి హైదరాబాద్ రెయిన్ అనే ట్యాగ్ చేశానన్నారు. దానికి తనపై చాలా దారుణంగా ట్రోల్ చేశారంటూ తెలిపారు. ఆంధ్రోడా అంటూ చిల్లర కామెంట్లు పెట్టారని, తాను వివరణ ఇచ్చినప్పటికీ.. కామెంట్స్ ఆగలేదని పేర్కొన్నారు. అందుకే కొంతకాలంగా ట్విట్టర్ కు దూరంగా ఉంటున్నానని చెప్పారు. ఈ నెల 29న థియేటర్లలో సందడి చేయనుంది.