పై ఫొటో చిరంజీవితో పాటు ఉన్న మహిళ తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్‌లో ఉన్న ప్రముఖ నటుడి భార్య. అతడు దాదాపు 30కిపైగా ఏళ్ల నుంచి సినిమా పరిశ్రమలో కొనసాగుతున్నారు.
పై ఫొటోలో మెగాస్టార్ చిరంజీవితో పాటు కనిపిస్తున్న ఆ మహిళ ఓ ప్రముఖ నటుడి భార్య. ఈ మధ్య కాలంలో ఆ నటుడు లేని సినిమాలు లేవని చెప్పవచ్చు. ఆ నటుడు దాదాపు 35 ఏళ్లనుంచి సినిమా పరిశ్రమలో కొనసాగుతున్నారు. సెకండ్ హీరోగా.. విలన్‌గా, క్యారెక్టర్ ఆరిస్ట్‌గా పదుల సంఖ్యలో సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో ఆయనకు మంచి అనుబంధం ఉంది.
చిరును ఆయన అన్నయ్య అని ఎంతో ఆప్యాయంగా పిలుస్తూ ఉంటారు. ఇక, ఆ నటుడి కుమారుడు కూడా హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఇంతకీ ఆ నటుడు ఎవరో గుర్తు రాలేదా.. ఆ నటుడు ఇంకెవరో కాదండి.. బ్రహ్మాజీ. పై ఫొటోలో చిరంజీవితో పాటు ఉన్న ఆ మహిళ నటుడు బ్రహ్మాజీ భార్య శశ్వతి. ఇది చాలా పాత ఫొటో. ఆ దంపతులు చిరంజీవిని కలిసినపుడు ఆయనతో ఫొటో దిగారు. ఆ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా, బ్రహ్మాజీ 1986లో వచ్చిన ‘మన్నెంలో మొనగాడు’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. రామ్‌గోపాల్ వర్మ మొదటి సినిమా ‘శివ’లో విలన్ గ్రూపులో నటించారు. అలా చాలా సినిమాల్లో విలన్ పాత్రలు చేశారు. సింధూరం సినిమాలో సెకండ్ హీరో పాత్రలో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎక్కువ సినిమాలు చేశారు. 2003లో వచ్చిన ‘జూట్’ సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టారు. దాదాపు ఏడు తమిళ సినిమాల్లో నటించారు. కన్నడలో ఓ సినిమా చేశారు.