తెలుగు బుల్లితెరపై సీరియల్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. అయితే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న సీరియల్‌లో చెప్పుకుంటే మాత్రం ఖచ్చితంగా కార్తీకదీపం అనే చెప్పక తప్పదు. ఈ సిరియల్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇక ఇందులో వంటలక్క పాత్ర ఎంతగా పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇక దీంతో పాటు వంటలక్క పేరు చెబితే కార్తీక దీపం సీరియల్ అని టక్కున గుర్తుకు వచ్చేలా క్రేజ్ సంపాదించుకుంది.
ఇక ఇందులో డాక్టర్ బాబు అనే పాత్రలో నటిస్తున్నారు నిరుపమ్ పరిటాల. కాగా ఇతనికి తల్లి పాత్రలో నటిస్తోంది నటి సౌందర్య. ఇక నిరుపమ్ ఎప్పుడు సోషల్ మీడియాలో కాస్త ఆక్టవ్‌గానే ఉండి తరుచు తన అప్‌డేట్‌లు ప్రేక్షకులతో పంచుకునే ప్రయత్నం చేస్తాడు. తాజాగా సీరియల్‌లో భాగంగా డా.బాబు జైళ్లో ఉంటాడు. అయితే డాక్టర్ బాబు నటి సౌందర్యతో ఓ ఫొటో దిగి తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేయటంతో పాటు.. అడక్కుండానే డాక్టర్ ను చేశావ్.. పిలవకుండానే స్టేషన్ కు వచ్చావ్..అయినా నువ్వు నాకు నచ్చావ్..అంటూ నిలదీసినట్లు ఫన్నీగా కామెంట్ పెట్టాడు. ఇక ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.