తెలుగు టివీ సీరియల్స్‌లో బాగా గుర్తింపు తెచ్చిన ధారావాహిక కార్తీక దీపం. 2017లో మొదలైన ఈ సీరియల్ ఇంటిల్లిపాదినీ అలరించింది. సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7.30 గంటలకు మాటివి ఈ సీరియల్ ప్రసారమౌతోంది. ఇప్పటి వరకు 1569 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. డాక్టర్ బాబు నిరుపమ్, వంటలక్క, దీపగా ప్రేమి విశ్వనాథ్, మోనితగా శోభా శెట్టి నటనను ప్రతి ఒక్క మహిళ కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ సీరియల్ ఎండ్ కార్డ్ పడిపోవడంతో మహిళలు కాస్తంత నిరాశకు గురౌతున్నారు. అయితే ఈ సీరియల్ సిబ్బంది ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సీరియల్ కు సీక్వెల్ ఉందని తీపి కబురు చెప్పారు.
ఈ సీరియల్ ముగింపు సమయంలో మళ్లీ వస్తామని చెప్పారు. దీనిపై స్పందించిన సీరియల్ సిబ్బంది.. ఈ సీరియల్ స్వీకెల్ ఉంటుందని చెప్పారు. అయితే కాస్త విరామం తీసుకున్నాక చేస్తామని తెలిపారు. విధి అనే సీరియల్ మినహా ఇప్పటి వరకు ఏ సీరియల్ కు సీక్వెల్ జరగలేదని.. త్వరలో మొదటి భాగం కథను డామినేట్ చేసేలా కొత్త కథను తయారు చేస్తామని చెప్పారు. ఈ సీరియల్ లో నటించే పెద్ద క్యారెక్టర్ల నుండి చిన్న క్యారెక్టర్లతో సహా ప్రతి ఒక్కరికి ఒక్కరికీ పేరు వచ్చిందని తెలిపారు. ఈ సీరియల్ సక్సెస్ లో ప్రతి ఒక్కరి పాత్ర ఉందని సీరియల్ హీరో నిరుపమ్ అన్నారు. తాను ఎక్కడకు వెళ్లిన భారీగా స్పందన వచ్చిందన్నారు. ఈ సీరియల్ నిర్మాత మాట్లాడుతూ.. తనకు ఈ సీరియల్ ద్వారా బాగా పేరు వచ్చిందని అన్నారు.