నిరుపమ్-మంజుల.. బుల్లితెర స్టార్ కపుల్ గా పలు సీరియల్స్ లో నటిస్తూ.. ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ఇక ఈ జంట త్వరలోనే ఓ కొత్త డూప్లెక్స్ హౌజ్ లోకి అడుగుపెట్టబోతున్నారు. అందుకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
కార్తీక దీపం సీరియల్ తో టీర్పీ రేటింగ్స్ కొల్లగొట్టి బుల్లితెర హీరోగా మారాడు నిరుపమ్. ఇక నిరుపమ్ కు హీరోకు ఉన్నంత క్రేజ్ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కార్తీకదీపం సీరియల్లో డాక్టర్ బాబుగా నిరుపమ్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఇక అతడి భార్య మంజుల సైతం పలు టీవీ సీరియల్స్ లో నటిస్తూ.. అదరగొడుతోంది. అయితే తాజాగా తమకు ఓ కొత్తిల్లు ఉందని, త్వరలోనే ఆ ఇంట్లోకి అడుగుపెట్టబోతున్నామని తెలిపింది ఈ స్టార్ కపుల్.
నిరుపమ్-మంజుల.. బుల్లితెర స్టార్ కపుల్ గా పలు సీరియల్స్ లో నటిస్తూ.. ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ఇక ఈ సెలబ్రిటీ జంట పలు షోల్లో సైతం మెరుస్తూ.. అదరగొడుతున్నారు. కార్తీక దీపం సీరియల్ ద్వారా ఓ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు నిరుపమ్. డాక్టర్ బాబు-వంటలక్క జోడీకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందంటేనే అర్ధం చేసుకోవచ్చు వీరి క్రేజ్ ఏంటో. అయితే సుమారు 18 సంవత్సరాల తర్వాత కొత్తింట్లోకి అడుగుపెట్టబోతున్నాం అని ప్రకటించింది ఈ జోడీ. ఇక ఇంటీరియల్ డిజైనింగ్ పనులు జరుగుతున్నాయి అంటూ కొత్త ఇంట్లో కలియ తిరుగుతూన్న వీడియోను పంచుకుంది మంజుల.
ఈ సందర్భంగా నిరుపమ్ మాట్లాడుతూ..”ఈ ఇంటిని మా నాన్న బుక్ చేశారు. గతంలో ప్రభుత్వం సినీకార్మికుల కోసం మంజూరు చేసిన హౌసింగ్ సొసైటీ ద్వారా ఈ ఇల్లు వచ్చింది. ఇక నాన్న లేకపోవడంతో.. ఆ ఇల్లు నాకు వచ్చింది. అయితే ఆ ఇల్లును బుక్ చేసి దాదాపు 15-18 సంవత్సరాలు కావొస్తోంది. ఇక ముందుగా ఆ ఇంటిని 3 BHK అనుకున్నారు, కానీ తర్వాత దానిని డూప్లెక్స్ ఫ్లాట్ గా తీర్చిదిద్దుతున్నారు” అని నిరుపమ్ చెప్పుకొచ్చాడు. ఇంటీరియల్ డిజైనింగ్ పనుల కారణంగానే ఆలస్యం అవుతూవస్తోందని అతడు తెలిపాడు. ఇక దాదాపు 18 సంవత్సరాల తర్వాత ఇల్లు పూర్తి అవుతుండటంతో సంతోషంగా ఉందని ఈ జోడీ సంతోషం వ్యక్తం చేస్తోంది.
ఇక ఇంట్లో జరుగుతున్న పనుల గురించి మంజుల తన యూట్యూబ్ ఛానల్ లో వీడియో ద్వారా వివరించింది. కాగా మంజుల-నిరుపమ్ ఇద్దరు కలిసి చంద్రముఖి అనే సీరియల్ లో లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సీరియల్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. దాంతో పెద్దలను ఒప్పించి,వారి అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. మరి ఎట్టకేలకు డూప్లెక్స్ హౌజ్ లోకి అడుగుపెట్టబోతున్న డాక్టర్ బాబు-మంజుల జోడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.