కష్టాలు లేని మనిషి జీవితం అన్నది ఉండదు. సెలెబ్రిటీలు కావచ్చు.. సామాన్య జనం కావచ్చు.. ఎవరికి తగ్గ రీతిలో వాళ్లు కష్టాలు పడాల్సి వస్తూ ఉంటుంది. అయితే, కష్టాలను దాటుకుని వెళితే..
తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఆశిష్ విద్యార్థి. విలన్‌గా, క్యారెక్టర్ ఆరిస్ట్‌గా తెలుగులో ఎన్నో సినిమాలు చేశారీయన. కేవలం తెలుగులోనే కాదు.. దాదాపు 6కు పైగా భాషల్లో ఆయన నటించారు. నటుడిగా ఎన్నో అవార్డులను అందుకున్నారు. అలాంటి ఆయన తన రంగు విషయంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. ఆయన్ని చాలా మంది బూతులు కూడా తిట్టారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పుకొచ్చారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..
‘‘ రంగు విషయంలో నేను చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. నల్లగా ఉన్నానని చాలా మంది నన్ను దారుణంగా తిట్టేవారు. నాపై కామెంట్లు చేసేవారు. ఢిల్లీలో ఉన్న సమయంలో చాలా మంది నా రంగు గురించి మాట్లాడుతూ బూతులు కూడా తిట్టేవారు. అది నాపై చాలా ప్రభావం చూపింది. ఇప్పుడైతే రంగు గురించి ఎవరూ పెద్దగా మాట్లాడటం లేదు. కానీ, అప్పట్లో పరిస్థితులు వేరేగా ఉండేవి. నాపై కామెంట్లు చేసే వారిని ఆపటం చాలా కష్టం. ఎందుకంటే వారందరి నోర్లు నేనొక్కడినే మూయించలేను కదా!.. వాళ్లు నా మౌనాన్ని తప్పుగా అర్థం చేసుకునే వారు. రెచ్చిపోయి కామెంట్లు చేసేవారు’’ అని అన్నారు.
కాగా, ఆశిష్ విద్యార్థి 60 ఏళ్ల వయసులో రెండో వివాహం చేసుకున్నారు. గత నెల 25న అసోం కి చెందిన 33 ఏళ్ల ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్ రూపాలి బారువాను ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 60 ఏళ్ల వయసులో ఆయన రెండో పెళ్లి చేసుకోవటం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలోనే ఆశిష్ విద్యార్థి మొదటి భార్య రాజోషి స్పందించారు. ‘ జీవితం అనే పజిల్ లో ఎప్పుడూ గందరగోళానికి గురికావొద్దు’ అని ఆమె పేర్కొన్నారు.