ప్రముఖ నటుడు ఆలీ ఇటీవలే కూతురు ఫాతిమాకి గ్రాండ్ గా పెళ్లి చేసిన సంగతి తెలిసిందే. ఆలీ కూతురి పెళ్లికి టాలీవుడ్ ప్రముఖులంతా హాజరై సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఇలా అందరూ నూతన దంపతులను ఆశీర్వదించారు. ఆల్రెడీ ఆలీ కూతురి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగవైరల్ అయ్యాయి. ఓవైపు ఆలీ సినిమాలు, టీవీ షోలు చేస్తూ బిజీగా గడిపేస్తున్నాడు. మరోవైపు ఆయన భార్య జుబేదా యూట్యూబ్ ద్వారా క్రేజ్ సంపాదించుకుని ఫ్యాన్స్ కి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తుంటారు. ఈ క్రమంలో కూతురు పెళ్లి పనుల నుండి పెళ్లి తంతు ముగిసేవరకు అన్ని వీడియోలు పోస్ట్ చేశారు.
ఇదిలా ఉండగా.. ఆలీ కూతురు ఫాతిమా డాక్టర్ కోర్స్ పూర్తిచేసిన విషయం విదితమే. కాబోయే అల్లుడు కూడా డాక్టర్ అయితే బాగుంటుందని.. ఆలీ తన కూతురికి డాక్టర్ నే తెచ్చి పెళ్లి చేశాడట. ఆలీ అల్లుడు షేక్ షహయాజ్ మంచి ఉన్నతమైన ఫ్యామిలీకి చెందినవాడని తెలుస్తోంది. కాగా.. అతను డాక్టర్ కావడం, పైగా సమాజ సేవలో ఇంటరెస్ట్ ఉండటంతో ఆలీ ఇంప్రెస్స్ అయిపోయాడని సినీ వర్గాలు చెబుతున్నాయి. కూతురి పెళ్లిలో ఆలీ, జుబేదా ఎమోషనల్ అయిన ఫోటోలు చూశాం. ఇప్పుడు కూతురు, అల్లుడు అమెరికా వెళ్తుండగా.. ఆలీ దంపతులు ఎమోషనల్ అవుతూ వీడ్కోలు పలికిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక ఆలీకి కూతురు, ఫ్యామిలీపై ఎంతో ప్రేమ. ముఖ్యంగా కూతురు తన కోరిక తీర్చిందని చెబుతుంటాడు. చిన్నప్పుడు ఆలీని డాక్టర్ గా చూడాలని వాళ్ళమ్మ చెప్పారట. కానీ.. డాక్టర్ కాకుండా ఆలీ యాక్టర్ గా పాపులర్ అయ్యాడు. దీంతో ఆలీ తన కూతురి ద్వారా డాక్టర్ కలను నెరవేర్చుకున్నాడు. అందుకే కూతురు విషయంలో ఎమోషనల్ అవుతుంటాడు ఆలీ. కాగా.. ఆలీ భార్య జుబేదాకి యూట్యూబ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాదాపు 7 లక్షల వరకు యూట్యూబ్ లో సబ్ స్క్రైబర్స్ ఉండగా.. తమ ఫ్యామిలీకి సంబంధించి ప్రతి విషయాన్నీ ఫ్యాన్స్ తో పంచుకుంటారు జుబేదా. మరి ప్రెజెంట్ వీరిద్దరూ కూతురు ఫాతిమాకి వీడ్కోలు పలికిన పిక్స్ వైరల్ గా మారాయి. మరి కూతురిని అత్తారింటికి పంపేటప్పుడు జరిగే ఎమోషనల్ మూమెంట్స్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.