హీరో లేదా హీరోయిన్, దర్శకుడు ఇలా వాళ్లు చేస్తున్న సినిమాలతో పాటు వారి ఫ్యామిలీ మ్యాటర్స్పై దృష్టిసారిస్తారు. హీరోయిన్ ఎవరితో డేటింగ్ చేస్తుంది, ఆమె బాయ్ ఫ్రెండ్ ఎవరు, అక్కా చెల్లెల్లు తమ్ముడు అంటూ హీరోలపైనా ఇదే రకమైన ఫోకస్ పెడతారు. అదే సెలబ్రిటీలకు పెళ్లి అయితే భార్య లేదా భర్త ఎవరు పిల్లలు ఎంత మంది.. ఆ పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారూ.. ఎవరితో రిలేషన్లో ఉన్నారో బూతద్ధం పట్టుకు వెతుకుతుంటారు.
సినిమా సెలబ్రిటీలతో పాటు వారి వ్యక్తిగత విషయాల్లోనూ తలదూరుస్తారు గూఢచారుల రూపంలో ఉన్న అభిమానులు, నెటిజన్లు. హీరో లేదా హీరోయిన్, దర్శకుడు ఇలా వాళ్లు చేస్తున్న సినిమాలతో పాటు వారి ఫ్యామిలీ మ్యాటర్స్పై దృష్టిసారిస్తారు. హీరోయిన్ ఎవరితో డేటింగ్ చేస్తుంది, ఆమె బాయ్ ఫ్రెండ్ ఎవరు, అక్కా చెల్లెల్లు తమ్ముడు అంటూ హీరోలపైనా ఇదే రకమైన ఫోకస్ పెడతారు. అదే సెలబ్రిటీలకు పెళ్లి అయితే భార్య లేదా భర్త ఎవరు పిల్లలు ఎంత మంది.. ఆ పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారూ.. ఎవరితో రిలేషన్లో ఉన్నారో బూతద్ధం పట్టుకు వెతుకుతుంటారు. ఇదే జరిగింది ప్రముఖ దర్శకుడు కూతురు విషయంలో.. అయితే ఆమె ఘాటుగా రిప్లై ఇచ్చిందనుకోండి.
సెలబ్రిటీల లేదా వారి పిల్లలకు సంబంధించిన విషయాలపై ఆసక్తి ఉండటం మంచిదేకానీ, ఓవర్ యాక్షన్ పనికి రాదు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కశ్యప్ విషయంలో నెటిజన్ తీరు ఇలానే ఉంది. ఆమె ఇటీవల తన స్నేహితుడు షేనుతో ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ ఫోటోలను తన ఇన్ స్టా ఖాతాలో పంచుకోగా.. సోషల్ మీడియా సైనికులు విరుచుకు పడ్డారు. 22 ఏళ్లకే నిశ్చితార్థం అవసరమా.. అప్పుడు పెళ్లి ఎందుకు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కామెంట్లపై ఆలియా గట్టిగానే బదులిచ్చింది. పెళ్లి అనేది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని చెప్పింది. విమర్శలను తాను పట్టించుకోనని.. తనకు నచ్చినట్టు ఉంటానని సమాధానమిచ్చింది.
‘నిశ్చితార్థం తర్వాత ఎంతోమంది మమ్మల్ని విమర్శించారు. చిన్న వయసులోనే మేమిద్దరం పెళ్లి వైపు అడుగులు వేస్తున్నామని నాకు తెలుసు. మా వరకూ ఇదేమీ పెద్ద విషయం కాదు. బయటవాళ్లు దీన్ని ఒక పెద్ద సమస్యగా ఎందుకు చూస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను వారి మాటలు పట్టించుకోను. పెళ్లికి వయసుతో సంబంధం లేదు. షేన్, నేనూ ఇష్టప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నాం. మేము మూడేళ్లుగా డేటింగ్, ఆరు నెలల నుంచి సహజీవనంలో ఉన్నాం. అలాగే, 20 ఏళ్లకే పెళ్లి చేసుకోమని నేను వేరే వాళ్లకు రికమండ్ చేయను. ఎందుకంటే ఇది ఒకరి వ్యక్తిగత విషయం. మేమిద్దరం రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం’ అని ఆమె తెలిపారు.