బాలీవుడ్ నటులు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ఒకటి కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈనెల 9న ఈ జంట పెళ్లి జరగనుంది. వీరి వివాహానికి అంతా సిద్ధమవుతున్నట్లు సమాచారం. రాజస్థాన్ లోని సవాయి మాధోపూర్ లోని సిక్స్ సెన్స్ పోర్ట్ బర్వారా ఇందుకు వేదికైంది. కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితులు, బాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో వీరి పెళ్లి నిరాడంబరంగా జరుగనున్నట్లు సమాచారం. కత్రినా కైఫ్ .. విక్కీ కౌశల్ వివాహ వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు పెద్ద ఓటీటీ సంస్థ బంపర్ ఆఫర్ ని ప్రకటించిందని సమాచారం. ఈ మేరకు వారికి రూ.100 కోట్లు ఇస్తామని ప్రకటించడం విశేషం. కాగా పాశ్చాత్య దేశాల్లో సెలెబ్రిటీలు తమ పెళ్లిళ్లకు సంబంధించిన ప్రసారాలను అమ్ముకోవడం సర్వసాధారణం. మ్యాగ్ జైన్స్, ఛానల్స్ కు వీడియోలు, ఫొటోలు అమ్ముతుంటారు.
ఇప్పుడు మన దేశంలోనూ అదే ట్రెండ్ కు ఓ ఓటీటీ సంస్థ శ్రీకారం చుట్టే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా కత్రినా-విక్కీల వివాహ వేడుక లైవ్ ప్రసారానికి రూ.100 కోట్లు ఆఫర్ చేసిందని అత్యంత విశ్వసనీయ వర్గాలు సమాచారం. వాళ్లు ఓకే అనడమే ఆలస్యం వారి వివాహ కార్యక్రమాన్ని లైవ్ ప్రసారం చేయటానికి సిద్ధంగా ఉన్నామని ఓ ఓటీటీ సంస్థ అంటున్నట్లు సమాచారం. లైవ్ ప్రసారంలో భాగంగా పెళ్లి లైవ్ ఫుటేజి, పెళ్లికి వచ్చిన అతిథులు, తారలు, ప్రముఖల ఇంటర్వ్యూల వంటి వాటిని ప్రసారం చేస్తారని చెబుతున్నారు. ఇదే నిజమైతే భారత్ లో కూడా ప్రముఖలు పెళ్లి లైవ్ ప్రసారం చేసే ట్రెండ్ మొదలైనట్లే. ఆ ఓటీటీ సంస్థ ఇచ్చిన ఆఫర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.