భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం సోమవారం అట్టహాసంగా జరుగుతుంది. 2019వ సంవత్సరం నుంచి వచ్చిన చిత్రాలకు ప్రకటించిన అవార్డులను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అందజేయనున్నారు. తెలుగు చిత్రాలకు ఐదు జాతీయ అవార్డులు దక్కాయి. జెర్సీకి రెండు, మహర్షికి మూడు అవార్డులు వచ్చాయి. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా జెర్సీ నిలిచింది. అలాగే.. జెర్సీ చిత్రానికి గాను బెస్ట్ ఎడిటర్‌గా నవీన్ అవార్డు సాధించారు. ఈసారి 3 నేషనల్ అవార్డులను దక్కించుకుంది మహర్షి మూవీ. ఈ సినిమాను నిర్మించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ హౌస్‌గా నేషనల్ అవార్డు గెలుచుకుంది. ఇక ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా రాజు సుందరం జాతీయ అవార్డు పొందారు. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా తెలుగు భాషలో జాతీయ అవార్డు సొంతం చేసుకుంది మహర్షి.
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా మలయాళం నుంచి ‘మరక్కర్’ నిలవగా, ‘భోంస్లే’ చిత్రానికి మనోజ్ బాజ్‌పాయీ, ‘అసురన్’ చిత్రానికి ధనుష్ ఉత్తమ నటులుగా అవార్డులను సొంతం చేసుకున్నారు. మణికర్ణిక, పంగా చిత్రాలకు.. కంగనా రనౌత్ ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకున్నారు. ఇక దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చిచోరే.. ఉత్తమ హిందీ చిత్రంగా అవార్డు అందుకోనుంది. సూపర్ డీలక్స్ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటుడు అవార్డు విజయ్‌సేతుపతికి దక్కింది.
మలయాళం జల్లికట్టు సినిమాకు గాను బెస్ట్ సినిమాటోగ్రఫీగా గిరీష్ గంగాధరన్ అవార్డు అందుకోనున్నారు. మరోవైపు సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు విశిష్ట పురస్కారం వరించింది. సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు ఆయనకు లభించింది. గత నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమకు ఆయన చేస్తోన్న సేవలు గుర్తించిన కేంద్రప్రభుత్వం.. ఆయన్ని ఈ పురస్కారంతో గౌరవించనుంది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయనకు అవార్డును అందజేయనున్నారు.
జాతీయ చలనచిత్ర అవార్డు విజేతలు వీరే :
ఉత్తమ చిత్రం : మరక్కల్ (మలయాళం)
ఉత్తమ నటుడు : మనోజ్ బాజ్ పాయి (భోంస్లే), ధనుష్ (అసురన్)
ఉత్తమ నటి : కంగనా రౌనత్ (మణికర్ణిక)
ఉత్తమ దర్శకుడు : సంజయ్ పూరన్ సింగ్ చౌహాన్ (బహత్తర్ హూరైన్)
ఉత్తమ తెలుగు చిత్రం : జెర్సీ
ఉత్తమ ఎడిటింగ్ : నవీన్ నూలి (జెర్సీ)
ఉత్తమ వినోదాత్మక చిత్రం : మహర్షి
ఉత్తమ హిందీ చిత్రం : చిచ్చోరే
ఉత్తమ తమిళ చిత్రం : అసురన్
ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ : అవనే శ్రీమన్నారాయణ (కన్నడ)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ : మరక్కర్ (మలయాళం)
ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు) : డి.ఇమ్మాన్ (విశ్వాసం)
ఉత్తమ సహాయ నటి : పల్లవి జోషి (ది తాష్కెంట్ ఫైల్స్)
ఉత్తమ సహాయ నటుడు : విజయ్ సేతుపతి (సూపర్ డీలక్స్)
ఉత్తమ సంగీద దర్శకుడు (నేపథ్య) : ప్రబుద్ద బెనర్జీ (జ్యేష్టపుత్రో)
ఉత్తమ గాయకుడు : బ్రి.ప్రాక్ (కేసరి చిత్రంలోని ‘తేరీ మిట్టి..)
ఉత్తమ గాయని : శావని రవీంద్ర (బర్దో – మరాఠీ)
ఉత్తమ కొరియోగ్రాఫర్ : రాజు సుందరం (మహర్షి)
ఉత్తమ మేకప్ : రంజీత్ (హెలెన్)