సినీ ఇండస్ట్రీలో ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా ఇటీవల బాలీవుడ్ లో వరుస సినిమాలు డైరెక్ట్ చేస్తూ బిజీగా ఉన్నారు. డ్యాన్సర్ గా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు ప్రభుదేవా.
సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు, దర్శక, నిర్మాతల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించిన సుందరం మాస్టర్ తనయుడు ప్రభుదేవ కొరియోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చి నటుడు, దర్శకుడిగా తన సత్తా చాటారు. ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ప్రభుదేవ 50 ఏళ్ల వయసులో తండ్రయ్యాడు. ఆయన రెండో భార్య హిమానీ సింగ్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే..
ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొరియోగ్రాఫర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నటుడు, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రభుదేవ మంచి ఫామ్ లో ఉండగా వివాహం చేసున్నారు.. కొంత కాలం తర్వాత అభిప్రాయ భేదాలతో ఆమెకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో ప్రభుదేవ జీవితంలో ప్రేమ, పెళ్లి అనే చెదు సంఘటనలు చాలా బాధించాయని అంటారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే దర్శకుడిగా సత్తా చాటుతున్నాడు. 2020 లో కరోనా సమయంలో హిమాని సింగ్ ని ద్వితీయ వివాహం చేసుకున్నారు.
ప్రభుదేవా తన 50 ఏళ్ల వయసులో తండ్రయ్యాడు. ఆయన రెండో భార్య హిమాని సింగ్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుదేవ స్పందించారు. ‘నేను 50 ఏళ్ల వయసులో తండ్రిని అయ్యాను.. చాలా సంతోషంగా ఉంది. ఇక నా జీవితం పరిపూర్ణమైందని తెలుస్తుంది. ఇప్పటి వరకు పనిఒత్తిడిలో మునిగిపోయాను.. ఇక నుంచి నా పనిభారాన్ని చాలా వరకు తగ్గించుకోవాలని అనుకుంటున్నా.. ఇక నుంచి నేను నా కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని భావిస్తున్నా, ఇప్పుడు నా భార్య, పాపకు నా అవసరం చాలా ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చారు.
1995లో సహ డ్యాన్సర్ అయిన రామలతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ప్రభుదేవా. ఈ జంటకు ముగ్గురు కుమారులు విశాల్, రిషి రాఘవేంద్ర దేవ, అదితి దేవ. 2008 లో విశాల్ మరణించాడు. కొన్ని కారణాల వల్ల 2010 లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. తర్వాత ఫిజియో థెరపిస్ట్ అయిన హిమాని సింగ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన మూడు సంవత్సరాల తర్వాత హిమని పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మొత్తానికి 50 ఏళ్ల వయసులో ప్రభుదేవా ముచ్చటగా నాలుగోసారి తండ్రి కావడంతో ఆయనకు అభిమానులు, ఇండస్ట్రీ వర్గం శుభాకాంక్షలు తెలుపుతున్నారు.