కొరియోగ్రాఫర్ చైతన్య.. అర్థాంతరంగా తనువు చాలించాడు. ఈ విషయమై ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతున్నారు. శేఖర్ మాస్టర్ కూడా తన సానుభూతి తెలియజేశారు.
‘ఢీ’ కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య చేసుకోవడం.. అందరిని షాక్ కి గురిచేసింది. ఇన్నిరోజులుగా తమ పక్కనే నవ్వుతూ, నవ్విస్తూ ఉన్న చైతన్య మాస్టర్.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సహ కొరియోగ్రాఫర్స్ ని ఒక్కసారిగా సైలెంట్ అయిపోయేలా చేసింది. అప్పుల కారణంగా చైతన్య మృతి చెందడంపై ‘ఢీ’ డ్యాన్స్ సభ్యులందరూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చైతన్య మాస్టర్ ఆత్మకు శాంతి కలగాలని పోస్టులు పెడుతున్నారు. అతడితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అయితే శేఖర్ మాస్టర్ కాస్త ఎమోషనల్ అయ్యారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘ఢీ’ ప్రస్తుత సీజన్ చూసేవాళ్లకు చైతన్య మాస్టర్ తెలుసు. ఎందుకంటే డ్యాన్స్ కి ఫన్ మూమెంట్స్ జోడీంచి, ఫెర్ఫార్మ్ చేయడంలో మనోడు చాలా ఎక్స్ పర్ట్. కొన్నాళ్ల ముందు హీరో రాజశేఖర్ ని ఇమిటేట్ చేస్తూ, చేసిన డ్యాన్స్ అయితే ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. రీసెంట్ గా శ్రద్ధా దాస్ తో ‘మాస్టారూ మాస్టారూ’ సాంగ్ కి డ్యాన్స్ చేయడం కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. అలాంటి చైతన్య సడన్ గా ప్రాణం తీసుకునేసరికి శేఖర్ మాస్టర్ షాక్ లో ఉండిపోయాడు.
‘నీ లాంటి టాలెంటెడ్ డ్యాన్స్ మాస్టర్ ని కోల్పోవడం నిజంగా బాధాకరం. ఈ వార్త విన్నప్పుడు నేను చాలా డిస్ట్రబ్ అయ్యాను. నీ చిరునవ్వు ఎప్పటికీ మర్చిపోలేను. నిన్ను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం చైతన్య’ అని శేఖర్ మాస్టర్ తన ఇన్ స్టాలో రాసుకొచ్చారు. ఇది చూస్తుంటే చైతన్య మృతిపై శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయినట్లు కనిపిస్తుంది. మరోవైపు శ్రద్ధాదాస్, రష్మీ, ఆది తదితరులు కూడా చైతన్య మరణంపై సంతాపం వ్యక్తం చేస్తూ, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. కారణం ఏదైనా సరే అర్థాంతరంగా మనల్ని విడిచివెళ్లిపోయిన చైతన్య మాస్టర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. వీలైతే మీ సంతాపాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.