చైతన్య మాస్టర్.. ప్రతి ఒక్కరినీ షాక్ కి గురిచేశాడు. నిన్నటివరకు నవ్వుతూ, నవ్విస్తూ ఉన్న అతడు ఇక లేడు అనే నిజాన్ని ఎవరూ తీసుకోలేకపోతున్నారు. చైతన్య మాస్టర్ తల్లి గుండె పగిలేలా కన్నీళ్లు పెట్టుకుంది.
అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు.. ఎదిగొచ్చిన కొడుకు.. కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న కొడుకు.. సడన్ గా ఆత్మహత్య చేసుకుంటే ఎవరికైనా ఎలా ఉంటుంది. చాలా బాధపడతారు. ఫ్రెండ్స్ గురించి వదిలేయండి కొన్నిరోజుల బాధపడతారు. ఆ తర్వాత మర్చిపోవచ్చు. కానీ ఇన్నాళ్లు కష్టపడి పెంచిన తల్లిదండ్రులు బాధ వర్ణనాతీతం. ‘ఢీ’ కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ తల్లికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెడుతున్నారు. ఈ తల్లి రోదన ప్రతి ఒక్కరి మనసుని ఎమోనషల్ చేస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘ఢీ’ షోలో కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న చైతన్య మాస్టర్, తనదైన డ్యాన్సులతో ఆకట్టుకున్నాడు. ఫన్ మూమెంట్స్ తో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయడంలో మనోడు స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి ఇతడు.. ఇప్పుడు అప్పుల బాధ తట్టుకోలేక నెల్లూరులోని ఓ ప్రైవేట్ లాడ్జిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ప్రతి ఒక్కరూ అతడి మృతిపై సంతాపం తెలియజేస్తున్నారు. సహ కొరియోగ్రాఫర్స్, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
ఫ్రెండ్, తోటి కొరియోగ్రాఫర్స్ కే అలా ఉంటే.. ఇక కనిపెంచిన తల్లి ఇంకెత బాధపడాలి. ఆస్పత్రి మార్చురీలో ఉన్న కొడుకు చైతన్య మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోయింది. గుండెల అవిసేలా కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియోనే ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. మరి చైతన్య మాస్టర్ అర్థాంతరగం తనువు చాలించడంపై మీరేం అనుకుంటున్నారు. మీ సంతాపాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.