మనలో చాలా మంది అప్పుల బాధతోనో, ఆర్థిక సమస్యలతోనో ఇబ్బంది పడుతుంటారు. ప్రతి ఒక్కరికీ ప్రస్తుత జీవన శైలి ప్రకారం డబ్బు చాలా చాలా అవసరం. డబ్బు లేనిదే జీవితం సాఫీగా సాగిపోవడం కష్టం. డబ్బు సంపాదించడం కోసం రోజూ అనేక వృత్తి, వ్యాపారాలు, వ్యాపకాలు చేసుకుంటూ బతుకుతుంటారు. అలా ఎంత కష్టపడినా సరే ఇంట్లో డబ్బు నిలవడం లేదని చాలామంది భావిస్తుంటారు. ఇలాంటి వారికి కొన్ని పద్ధతులు పాటించడం వల్ల ఇంట్లోకి సిరిసంపదలు వచ్చి చేరుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ అవేంటి? డబ్బు వృద్ధి కావాలంటే ఏం చేయాలి తెలియాలంటే ఈ స్టోరీని చివరి వరకు చదివేయాల్సిందే.
డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, దాచుకోవడమూ అంతే ముఖ్యం. సంపాదనని కేవలం తినడానికి, ఖర్చు పెట్టడానికి కాకుండా కాస్త పొదుపు కూడా చేసుకోవాలి. అప్పుడే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. ఇక ఇంట్లో సిరిసంపదలు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చయిపోకుండా కాస్త మన దగ్గర కుదురుగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. డబ్బు మనకు నెగిటివ్ వే నుంచి రావొచ్చు. పాజిటివ్ వే నుంచి కూడా రావచ్చు. వచ్చిన డబ్బుకు నెగిటివ్ నెస్ కడిగేసుకోవాలనుకుంటే అందుకు కొన్ని మార్గాలున్నాయి. అందులో ముఖ్యమైనది.. ఇది అత్యంత సులభంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోనే చేసుకొనే ప్రక్రియ.
ఓ పెద్ద స్టీల్ పళ్లెం తీసుకోవాలి. అందులో మొదట రాళ్ల ఉప్పు ఒక లేయర్ పరవాలి. దానిపై కాస్త పసుపు, కుంకుమ వేయాలి. తర్వాత మీరు తెచ్చిన డబ్బు అంతా ఓ క్రమ పద్ధతిలో అక్కడ పెట్టుకోవాలి. ఇలా అన్ని నోట్లూ ఉప్పుకు తగులుతూ ఉండేలా చూసుకోవాలి. ఇలా మూడు రాత్రులు ఉంచాలి. ఇంట్లో దేవుడి పటాల వద్ద లేదా పూజా మందిరంలో ఇలా మూడు రాత్రులు నోట్లతో కూడిన పళ్లెం ఉంచాలి. మూడో రోజు ఉదయాన్నే ఈ పళ్లెం తీయాలి. పళ్లెంలోని ఉప్పును బకెట్ నీటిలో కలిపి తర్వాత పారబోయాలి. డబ్బుకు పట్టిన నెగిటివ్ ఎనర్జీ అంతా ఉప్పు లాగేసుకుంటుంది. అక్కడ ఉంచిన డబ్బులో రెండు లేదా మూడు నోట్లు తీసి ఇంట్లో దాచుకోవాలి. తర్వాత ఓ రెండు మూడు నెలలు దాటాక ఇంట్లో డబ్బు వృద్ధి జరుగుతుంది!