కరోనా మహమ్మారి వల్ల సోషల్ డిస్టెన్స్, సెల్ఫ్ ఐసోలేషన్ అనే పదాలు ప్రతి ఒక్కరి నోటా నానుతున్నాయి. కరోనా వల్ల సాఫ్ట్వేర్ఉద్యోగులు ఇంటికి పరిమితమై ఒకరకంగా హోమ్ఐసోలేషన్లో ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఇక సాధారణ ప్రజలు ఎక్కడ బయటకు వెళ్లినా మాస్కులు, శానిటైజర్‌ను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా భౌతికదూరం పాటిస్తున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ప్రమాదకరమైన వైరస్ వల్లనో లేక జబ్బు వల్లనో కాకుండా ఒకటి రెండు కాదు – ఏకంగా పది సంవత్సరాల నుంచి అతను హోమ్ ఐసోలేషన్‌లోనే ఉంటున్నాడు. కావలసినవన్నీ ఆన్లైన్లోనే ఆర్డర్ ఇస్తాడంట. కేవలం మూడు నెలలకు మాత్రమే బార్బర్ షాపుకు వెళ్లేందుకు బయటకు వస్తాడట. ఇతను యూ ట్యూబ్ ఛానెల్ మెంటెన్ చేస్తున్నాడు. నీటో సౌజీ పేరుతో ఉన్న ఈ ఛానెల్లో తన రెగ్యులర్ జీవితాన్ని గురించి ఫాలోవర్లకు అప్డేట్స్ ఇస్తుంటాడు.
ఈ విధానం అనుసరించేవాళ్లు జపాన్‌లో దాదాపు పది లక్షల మంది ఉన్నారంట. ఇందులో యువకులు ఐదు లక్షలమంది ఉండగా మరో ఐదు లక్షల మంది మధ్య వయస్కులకు చెందిన వారట. తాను ఇన్నేళ్లుగా హోమ్ ఐసోలేషన్‌లోనే ఉండడంపై సౌజీ ఏమంటున్నాడంటే ‘బయటకు వెళ్లడమంటేనే భయం. బయటకు వెళ్లడాన్ని అవమానంగా భావిస్తుంటా. గత పదేళ్లుగా ఇలాగే బతుకుతున్నా. ఇకపైకూడా ఇలాగే జీవిస్తానని అంటున్నాడు.