ఈపీఎఫ్.. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్. ఈ ఫండ్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే.. ఉద్యోగి జీతంలోంచి నెలనెలా కొంత మొత్తాన్ని భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయడమే. ఇలా పొదుపు చేయడమే కాకుండా.. ఆ మొత్తానికి వడ్డీని కూడా చెల్లిస్తుంది. సాధారణంగా ఈ పీఎఫ్ మొత్తాన్ని పదవీ విరమణ తర్వాత లేదా ఉద్యోగం మానేసిన రెండు నెలల తర్వాత తీసుకుంటుంటారు. అయితే.. ఖాతాదారుల సౌలభ్యం కోసం ఈపీఎఫ్ఓ, పీఎఫ్ లో కొంత మొత్తాన్ని పాక్షికంగా ముందే విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. వైద్య చికిత్స ఖర్చులు, వివాహం, ఉన్నత చదువులు, ఇంటి కొనుగోలు వంటి కారణాలతో పాక్షిక విత్‌డ్రాలను అనుమతిస్తారన్న సంగతి అందరికి తెలిసిందే. పీఎఫ్ విత్ డ్రా రూల్స్ఈపీఎఫ్ వో మరో కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా మార్పుల ప్రకారం.. ఇకపై ఈపీఎఫ్ఓ సభ్యులు మెడికల్ ఎమర్జెనీ సమయంలో పీఎఫ్‌లో కొంత భాగాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ మేరకు కిందటి ఏడాది రూల్స్ లో మార్పులు చేసి అనుమతిస్తున్నట్లు ఈపీఎఫ్ఓ ప్రకటించింది. గతంలోనైతే హాస్పిటల్ ఎస్టిమేట్ బిల్ వచ్చిన తర్వాత మాత్రమే ఉపసంహరణలు చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఐతే తాజా సవరణతో.. ఎటువంటి అంచనాల పత్రాలు పనిలేకుండా ఈపీఎఫ్సీ సభ్యులు దాదాపు రూ.లక్ష వరకు మెడికల్ అడ్వాన్స్‌ను విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతి లభించినట్లైంది. ఐతే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీం పరిధిలోని ఎంప్లాయిస్‌కు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. పబ్లిక్ సెక్టార్ యూనిట్ (PSU)/ CGHS-ఎంప్యానెల్డ్ ఆసుపత్రుల్లో అడ్మిట్ అయిన ఉద్యోగులు పీఎఫ్ ఉపసంహరనకు అర్హులు.
అంతేకాక ఇతర కారణాల వల్ల కూడా ఉద్యోగులు రిటైర్మెంటుకు ముందే తమ పీఎఫ్ ను ఆన్లైన్లో e-SEW పోర్టల్ నుంచి సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. మరో ముఖ్య గమనిక ఏమిటంటే.. PF ఖాతాకు డబ్బును డిపాజిట్ చేయడానికి ఆయా వ్యక్తుల ఆధార్ కార్డును UANతో తప్పనిసరిగా లింక్ చెయ్యాలి. ఇది EPFO వెబ్సైట్ నుంచి లేదా UMANG మొబైల్ యాప్ ద్వారా చేసుకోవచ్చు. పీఎఫ్ ఉపసంహరించుకునే ముందు KYC ఫార్మాలిటీని పూర్తిగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. మరి.. ఈపీఎఫ్ వో చేసిన తాజా సవరణలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: SBI కి షాకిచ్చిన కోర్టు.. మహిళకు అనుకూలంగా తీర్పు.. 54 లక్షల లోను మాఫీ!
ఇదీ చదవండి: ఆకాశంలో విహరించాలనుకునే వారికి గుడ్ న్యూస్.. రూ. 9కే విమాన ప్రయాణం!
ఇదీ చదవండి: Personal Loan: గంటలోపే పర్సనల్ లోన్.. ఎలా అప్లై చేయాలంటే?