ఈపీఎఫ్.. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్. ఈ ఫండ్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే.. ఉద్యోగి జీతంలోంచి నెలనెలా కొంత మొత్తాన్ని భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయడమే. ఇలా పొదుపు చేయడమే కాకుండా.. ఆ మొత్తానికి వడ్డీని కూడా చెల్లిస్తుంది. సాధారణంగా ఈ పీఎఫ్ మొత్తాన్ని పదవీ విరమణ తర్వాత లేదా ఉద్యోగం మానేసిన రెండు నెలల తర్వాత తీసుకుంటుంటారు. అయితే.. ఖాతాదారుల సౌలభ్యం కోసం ఈపీఎఫ్ఓ, పీఎఫ్ లో కొంత మొత్తాన్ని పాక్షికంగా ముందే విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తోంది. వైద్య చికిత్స ఖర్చులు, వివాహం, ఉన్నత చదువులు, ఇంటి కొనుగోలు వంటి కారణాలతో పాక్షిక విత్‌డ్రాలను అనుమతిస్తారు.
ఈపీఎఫ్ ఖాతా నుంచి ఆన్ లైన్ ద్వారా పీఎఫ్ విత్ డ్రా చేసుకోవాలంటే ముందుగా యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) పొందడం, దీన్ని ఆన్లైన్లో యాక్టివేట్ చేసుకోవడం, కేవైసీ పూర్తిచేయడం, ఈ-నామినేషన్ దాఖలు, బ్యాంకు అకౌంట్, మొబైల్ నంబరు అప్డేట్ వంటివి పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా యూనివర్సల్ అకౌంట్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్, బ్యాంక్ అకౌంట్. ఇందులో ఏ ఒక్కటి పూర్తికాకపోయినా ఆన్ లైన్ ద్వారా నగదు విత్ డ్రా చేసుకోవడం సాధ్యం కాదు.
పీఎఫ్ అమౌంట్ ఆన్ లైన్ లో విత్ డ్రా చేసుకొనే విధానం..
స్టెప్ 1: ముందుగా ఈపీఎస్ఓ పోర్టల్ కు వెళ్లి.. స్క్రీన్ లో మెనూ బార్ లో కనిపిస్తున్న సర్వీసెస్ సెక్షన్ లో ఉన్న ఫర్ ఎంప్లాయీస్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఆపై కింది భాగంలో ర్వీసెస్ సెక్షన్ లో ఉన్న మెంబర్ యూఏఎన్/ఆన్లైన్ సర్వీసెస్ పై క్లిక్ చేయాలి.
స్టెప్ 2: ఇక్కడ కుడి వైపున మీ యూఏఎన్, పాస్వర్డ్ తో పాటు కింద ఇచ్చిన క్యాప్చా కోడ్ ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
ఒకవేళ మీకు యూఏఎన్ నంబరు లేకపోతే ఆన్ లైన్ ద్వారా జనరేట్ చేసుకోవచ్చు. లాగిన్ పేజీలో ఎడమవైపు కింది భాగంలో ‘Direct UAN Allotment by Employees’ ఆప్షన్ పై క్లిక్ చేసి ఆధార్ అనుసంధానమైన మొబైల్ నంబరు, క్యాచ్ కోడ్ వివరాలు వంటివి ఎంటర్ చేసి యూఏఎన్ పొందచ్చు. ఒకవేళ మీరు యూఏఎన్ నంబరు మర్చిపోతే అదే పేజిలో ‘Know Your UAN’ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. అదే విధంగా యూఏఎన్ నంబరు యాక్టివేషన్ చేసుకోనట్లయితే.. యాక్టివేషన్ కోసం Activate UAN’ పై క్లిక్ చేయాలి.
స్టెప్ 3: యూఏఎన్ నెంబర్, పాస్ వర్డ్ తో లాగ్ ఇన్ అయ్యాక.. మెంబర్ ప్రొఫైల్ పేజ్ ఓపెన్ అవుతుంది.
స్టెప్ 4: ముందుగా కేవైసీ నిబంధనలు పూర్తి చేసింది, లేనిది చూసుకునేందుకు ‘మ్యానేజ్’ పై క్లిక్ చేయండి. అందులో ‘కేవైసీ బటన్ పై క్లిక్ చేయడం ద్వారా కేవైసీ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడే ఈ-నామినేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇప్పటివరకు ఈ-నామినేషన్ పూర్తి చేయని వారు ఇక్కడ దాఖలు చేయవచ్చు. దీంతో పాటు మొబైల్ నంబరు తదితర వివరాలనూ అప్డేట్ చేసుకోవచ్చు. ఈ-నామినేషన్ కంటే ముందు ప్రొఫైల్ పిక్చరిన్ని అప్డేట్ చేసుకోవాలని గుర్తుంచుకోండి.
స్టెప్ 5: అనంతరం పైన మెనూ బార్ లో ఉన్న ‘ఆన్ లైన్ సర్వీసెస్’ ట్యాబ్ పై క్లిక్ చేసి క్లెయిమ్ (ఫారం -31 19 & 10సీ) ఎంచుకోండి. ఇక్కడ సభ్యుని వివరాలు కనిపిస్తాయి.
స్టెప్ 6: ‘వేరిపై’ అని ఉన్న చోట మీ యూఏఎన్ నంబరు అనుసంధానమైన బ్యాంకు ఖాతా నంబరును పూర్తిగా నమోదు చేసి, ‘వెరిఫై ఆప్షన్ పై క్లిక్ చేయండి. సరైన వివరాలు ఇస్తే ఒక మెసేజ్ వస్తుంది. దానిలో ‘యెస్’, ‘నో’.. రెండు ఆప్షన్లు ఉంటాయి. ‘యెస్ పై క్లిక్ చేయాలి.
స్టెప్ 7: తర్వాత వచ్చే స్క్రీన్ లో బ్యాంకు ఖాతా వివరాలు సిస్టమ్ లో ఉన్న డేటాతో సరిపోయినటైతే ఆకుపచ్చ రంగులో ఒక టిక్ మార్క్ కనిపిస్తుంది. కింద ‘ప్రొసీడ్ ఫర్ క్లెయిమ్’ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసే మరొక స్క్రీన్ వస్తుంది.
ఆన్ లైన్ ద్వారా నగదు విత్ డ్రా క్లెయిమ్ దాఖలు చేసేటప్పుడు, మూడు రకాల పామ్ లు ఉంటాయి.
1. ఫారం 31: (పీఎఫ్ మొత్తంలో కొంత భాగాన్ని ఉపసంహరించుకోవడానికి) – ఈ పారంను పాక్షిక ఉపసంహరణ అభ్యర్ధనను ప్రాసెస్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు.
2. ఫారం 19: (పీఎస్ ఉపసంహరణకు మాత్రమే) – ఇది మీరు సేకరించిన మొత్తం పీఎఫ్ ను ఉపసంహరించుకోడానికి ఉపయోగించబడుతుంది, దీనిని ఫైనల్ సెటిల్మెంట్ అని కూడా పిలుస్తారు.
3. ఫారమ్ 10సీ: (పెన్షన్ ఉపసంహరణకు మాత్రమే) – ఈ ఫారంను పెన్షన్ మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తారు.
ఈ మూడింటిలో మీకు కావాల్సిన ఆప్షన్ ఎంచుకుని ప్లాసీడ్ ఫర్ ఫరర్ క్లెయిమ్’ పై క్లిక్ చేయాలి.
స్టెప్ 8: ఇక్కడ ఒక ఫారం ఓపెన్ అవుతుంది. ఇందులో మీ సర్వీస్ వివరాలు, ఏ కారణంతో పీఎప్ విత్ చేసుకోవాలనుకుంటున్నారు, చిరునామా తదితర వివరాలను ఎంటర్ చేసి, మీ బ్యాంకు పాస్ బుక్ లేదా క్యాన్సల్ల్డ్ చెక్ (స్కాన్) కాపీని అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత కింద కనిపించే బాక్సులో టిక్ చేస్తే గెట్ ఆధార్ ఓటిపి ఆప్షన్ వస్తుంది.
స్టెప్ 9: ఓటీపీ వచ్చిన తర్వాత ఎంటర్ చేసి సబ్మిట్ చేసి, క్లెయిమ్ ఫారమ్ ను సమర్పించాలి. తరువాత మీ ఆన్ లైన్ పీఎఫ్ క్లెయిమ్ ను ప్రాసెస్ చేయబడుతుంది. ఆన్లైన్ పీఎఫ్ క్లెయిమ్ ప్రాసెస్ పూర్తైతే 10 రోజుల్లో మీ అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అవుతాయి.
గమనిక: ఈ మధ్యకాలంలో ఈపీఎఫ్ఓ, పీఎఫ్ చందాదారుల కుటుంబసభ్యుల సామాజిక భద్రత కోసం ఈ-నామినేషన్ తప్పనిసరి చేసింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.