స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక సోషల్ మీడియా వినియోగం ఊహించని స్థాయిలో పెరిగింది. ప్రస్తుతం కాలంలో తిండి లేకపోయినా ఉంటారేమో గాని చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే బ్రతకలేం అంటున్నారు యువతీ యువకులు. అయితే చేతిలోకి స్మార్ట్ ఫోన్స్ వచ్చాక అబ్బాయిలు, అమ్మాయిలు ఎక్కువగా ఏ యాప్స్ చేస్తున్నారు? గూగుల్ లో ఎక్కువగా వేటికోసం వెతుకుతున్నారు? అనే సందేహాలు కలగడం సహజం.
తాజాగా గూగుల్ లో అమ్మాయిలు, మహిళలు ఎక్కువగా ఏ అంశాలు సెర్చ్ చేస్తున్నారనే అంశాలపై ఓ కొత్త నివేదిక బయటికి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఇండియాలో సుమారు 150 మిలియన్ల జనాభా ఇంటర్నెట్ వినియోగిస్తోంది. వీరిలో 60 మిలియన్ల వరకు మహిళలు ఉండగా.. వీరిలో 15-34 ఏళ్ల మధ్య వయసున్నవారే 75% మంది ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వీరంతా రోజు ఇంటర్నెట్ ని తమ అవసరాలకు అనుగుణంగా ఉపయోగిస్తున్నారు.
ఇంతకీ అమ్మాయిలు – మహిళలు గూగుల్ లో ఎక్కువగా వెతికే అంశాలేంటో చూద్దాం!
కెరీర్: అమ్మాయిలు ఎక్కువగా కెరీర్ సంబంధిత కోర్సులు, ఏయే కోర్సులు చేసి లైఫ్ కి యూజ్ అవుతాయనే విషయానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.
ఆన్ లైన్ షాపింగ్: ఈ మధ్యకాలంలో అమ్మాయిలు ఆన్ లైన్ షాపింగ్ ఎక్కువగా చేస్తున్నారు. కొత్త దుస్తులు, న్యూ కలెక్షన్లు లాంటివి గూగుల్ ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారట.
బ్యూటీ టిప్స్: అందం కోసం పరితపించే వారిలో అమ్మాయిలు, మహిళలు ఎల్లప్పుడూ ముందే ఉంటారు. అందుకే ఎక్కువగా గూగుల్ లో బ్యూటీ టిప్స్, ఫ్యాషన్, ట్రెండ్స్, హోమ్ రెమెడీస్ వెతుకుతారని తెలుస్తుంది.
మెహందీ డిజైన్స్: నేటితరం అమ్మాయిలు గోరింటాకు కంటే మెహందీ పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. అందుకే తరచుగా హెన్నా డిజైన్లు వెతుకుతారని నివేదికలు చెబుతున్నాయి.
మ్యూజిక్: మ్యూజిక్(సంగీతం) అనేది అందరికి ఆసక్తి కలిగించే విషయమే. అయితే.. అమ్మాయిల విషయానికి వస్తే ఆన్ లైన్ లో ఎక్కువగా రొమాంటిక్ సాంగ్స్ వినేందుకు ఇంటరెస్ట్ చూపుతున్నట్లు తెలుస్తుంది. అలాగే ఆన్ లైన్ లో రొమాంటిక్ బుక్స్, నవలలు, కవితలు లాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని సమాచారం.