దేశంలో అత్యున్నత ప్రభుత్వ సర్వీసులైన ఐఎఎస్, ఐపిఎస్ ఉద్యోగాలు సాధించాలని యువత కలలు కంటుంటారు. ఐఎఎస్, ఐపిఎస్ లుగా ఎంపికై దేశ సేవలో తమ వంతు బాధ్యతలను నిర్వర్తించాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. ఏండ్ల తరబడి సన్నద్ధమై యూపిఎస్సీ నిర్వహించే సివిల్స్ పరీక్షలను రాస్తారు. సివిల్స్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాదిమందికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ 2022 తుది పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్స్ 2022 తుది పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. దేశ వ్యాప్తంగా 933 అభ్యర్థులను ఎంపిక చేసి ర్యాంకులను వెల్లడించింది. ఎంపికైన మొత్తం అభ్యర్థులో ఐఎఎస్ కు 180 మందిని, ఐపిఎస్ కు 200మందిని, ఐఎఫ్ఎస్ కు 38 మందిని ఎంపిక చేసింది. ఇక సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఎకు 473 మందిని, గ్రూప్ బి కు 131 మందిని ఎంపిక చేసింది. మొత్తం 345 మంది జనరల్ కోటాలో ర్యాంకులు సాధించారు. ఇక 99 మంది ఈడబ్య్లఎస్ కోటాలో, 263 మంది ఒబిసి కోటాలో, 154 మంది ఎస్సీ కోటాలో, 72 మంది ఎస్ టి కోటాలో 2022 సివిల్ సర్వీసులకు ఎంపికయ్యారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇషితా కిశోర్ సివిల్స్ మొదటి ర్యాంకు సాధించగా, గరిమా లోహియా రెండవ ర్యాంకు, ఉమా హారథి ఎన్ మూడో ర్యాంకు దక్కించుకున్నారు. సివిల్స్ తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు అభ్యర్థులు కూడా విజయదుందుభి మోగించారు. సివిల్స్ మెయిన్స్‌లో అర్హత పొందిన వారిని పర్సనాలిటీ టెస్టు కోసం ఈ ఏడాది జనవరి 30వ తేదీ నుంచి మే 18 వరకు యూపిఎస్సీ ఇంటర్వ్యూ చేసింది. సివిల్స్ -2022 లో 11లక్షల మంది అభ్యర్థులు పోటీపడ్డారు.
సివిల్స్ ఫలితాల్లో మెరిసిన తెలుగురాష్ట్రాల అభ్యర్థులు
తిరుపతికి చెందిన బివిఎస్ పవన్ దత్తా 22వ ర్యాంకు. హెచ్ఎస్ భావనకు 55, సాయి ప్రణవ్‌కు 60, నిధి పాయ్ 110, అంకుర్ కుమార్ 257, చల్లా కళ్యాణి 285, వై శృతి 362, శ్రీకృష్ణ 293, హర్షిత 315, లక్ష్మి సుజిత 311, సోనియా కటారియా 376, రేవయ్య 410, సీహెచ్ శ్రవణ్ కుమార్ రెడ్డి 426, రెడ్డి భార్గవ్ 772, నాగుల కృపాకర్ 866వ ర్యాంకు సాధించారు.