తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. తెలంగాణ గ్రూప్ – 4 నోటిఫికేషన్ విడుదల చేసింది. 9,168 పోస్టులు గ్రూప్-4 ద్వారా భర్తీ చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ద్వారా వెల్లడించింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయబోతున్నట్టు తెలిపింది. ఈ నెల 23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఏప్రీల్ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
రిక్యూట్ మెంట్ నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయనున్నట్లు మంత్రి హరీష్ రావు తెలియజేశారు. ఈ పోస్టులన్నీ రాత పరీక్షల ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది. కాగా, ఇటీవల 9,168 పోస్టులు భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతులను జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. మొత్తానికి తెలంగాణలో కొలువుల జాతర మొదలు కాబోతున్న విషయం తెలుసుకొని నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.