నిరుద్యోగులకు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్‌సీ వంటి పైచదవులు చదివారా..? బ్యాంక్ ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్. దేశీయ అతి పెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 217 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో 182 రెగ్యులర్ పోస్టులు ఉండగా, 35 ఒప్పంద ప్రాతిపదిక పోస్టులున్నాయి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు మే 19లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా దరఖాస్తు చేయాలి..? ఎంపిక విధానం..? వంటి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం ఖాళీలు: 217
విభాగాల వారీగా ఖాళీలు:
విద్యార్హతలు: బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్‌సీ పూర్తి చేసిన వారు అర్హులు.
వయోపరిమితి: 31-03-2023 నాటికి సంబంధిత పోస్టులను అనుసరించి అభ్యర్థుల వయస్సు 31 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకు రూ.750 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు చేయు విధానం: ఆన్ లైన్
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 29.04.2023
దరఖాస్తులకు చివరి తేదీ: 19.05.2023