తెలంగాణలో ఈ నెల 7వ తేదీన ఎస్‌ఐ ఉద్యోగాలకు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ‘కీ’ పేపర్‌ను అధికారులు ఆగస్ట్ 12వ తేదీన విడుదల చేశారు. ఎస్‌ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశ్నపత్రంలో 8 తప్పులు వచ్చాయని.. మరో 6 ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు సరైనవేనని గుర్తించారు.
ఈ 6 ప్రశ్నల్లో ఒక దానికి మూడు సరైన ఆప్షన్లు ఉండగా.. మరో 5 ప్రశ్నలకు రెండు సరైన ఆప్షన్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రతి అభ్యర్థికి 8 మార్కులు కలపాలని మండలి ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇక ఎనిమిది మార్కులు అదనంగా కలవడంతో ఎక్కువ మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అయ్యే చాన్స్ ఉందని అంటున్నారు.
ఈ పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలకు 60 మార్కులను (30%) అర్హతగా నిర్ణయించిన సంగతి విదితమే. విషయంలో అభ్యర్థులకు ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా.. ఆగస్టు 15న సాయంత్రం 5 గంటల వరకు తెలియజేయాలని అధికారులు కోరారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: నర్సుపై కన్నేసిన కీచక డాక్టర్.. నైట్ డ్యూటీకి రమ్మని!
ఇది చదవండి: పండగపూట పట్టలేని ఆనందం.. అంతలోనే ఊహించని విషాదం