ప్రభుత్వ ఉద్యోగం కోసం నిరుద్యోగులు ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతుంటారు. అలానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జాబ్ కు సంబంధించిన నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయా.. అని ఎదురు చూస్తుంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా నిరుద్యోగులు జాబ్ నోటిఫికేషన్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో నిరుద్యోగులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఏలూరు, చిత్తూరు,కర్నూలు జిల్లాల్లోని సహకార కేంద్ర బ్యాంకుల్లో క్లర్క్, అస్టిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పుడు ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలేంటో తెలుసుకుందాం…
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు ఏపీసీవోబీ గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ జిల్లాల్లో ఉన్న తమ బ్యాంకుల్లో ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏలూరు , చిత్తూరు, కర్నూలు జిల్లాల్లోని సహకార కేంద్రబ్యాంకుల్లో క్లర్క్, అసిస్టింట్ మేనేజర్ పోస్టులకు సంబంధించి మొత్తం 168 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇక ఈ మూడు సహకార కేంద్రబ్యాంకులలోని ఖాళీల వివరాలను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. ఏలూరులు జిల్లాలోని ఏలూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్.. శాశ్వత ప్రాతిపదికన స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టుల అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు.
ఈ బ్యాంకులో స్టాప్ అస్టిస్టెంట్ / క్లర్క్ పోస్టులు 95 ఉన్నాయి. ఏదైనా డిగ్రీ పాసై ఉండి. తెలుగు, ఇంగ్లీష్, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక వయోపరిమితి విషయానికి వస్తే 01.10.2022 నాటికి 18 నుంచి గరిష్టంగా 30 ఏళ్ల మధ్య మాత్రమే ఉండాలి. ఇక ఈ ఉద్యోగంలోని వేతనం విషయానికి వస్తే.. నెలకు రూ. 17,900 నుంచి రూ.47,920 మధ్య ఉంటుంది. ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్ధిని ఎంపిక చేస్తారు. జనరల్ వారికి దరఖాస్తు ఫీజు రూ.590 కాగా మిగిలిన ప్రత్యేక కేటగిరి వారి రూ. 413 గా నిర్ణయించారు. ఇకా పూర్తి వివరాలకు https://apcob.org/careers/ ను చూడండి.
ఇక చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల వివరాల విషయానికి వస్తే.. ఇక్కడ 15 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడులైంది. చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ .. శాశ్వత ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. 60శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా 55శాతం మార్కులతో కామర్స్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ పోస్టులకు అర్హుతలు. అయితే పోస్ట్ గ్రాడ్యూయేషన్ లో(ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్), కంప్యూటర్ పరిజ్ఞానమున్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. 01.10.2022 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య కలిగిన వారు ఈ పోస్టులకు అర్హులు.
ఈ ఉద్యోగంలో ఎంపికైన వారికి నెలకు రూ.26,080 – రూ.57,860 వరకు జీతం ఉంటుంది. ఇది కూడా ఆన్‌లైన్ టెస్ట్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్ధిని ఎంపిక చేస్తారు. జనరల్ కేటగిరి వారికి రూ.590.. మిగిలిన ప్రత్యేక కేటగిరి వారికి రూ.413 పరీక్ష ఫీజు ఉంది. అలానే చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో 40 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఇంగ్లిష్, తెలుగు భాషలు, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు అర్హులు. ఆసక్తి గల వారు పూర్తి వివరాలకు https://apcob.org/careers/ చూడండి.
కర్నూలు జిల్లాలోని కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్.. శాశ్వత ప్రాతిపదికన 18 స్టాఫ్ అసిస్టెంట్, క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, ఇంగ్లిష్, తెలుగు భాషలు, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు అర్హులు. 01.10.2022 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల ఉన్నవారు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. ఇక జీతం విషయానికి వస్తే.. నెలకు రూ.17900 నుంచి రూ.47920. వరకు ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. పై రెండు జిల్లాల మాదిరే ఇక్కడ జనరల్ కేటరగిరి వారికి రూ.590, మిగిలిలన వారు రూ.413 దరఖాస్తు ఫీలు చెల్లించాలి. పూర్తి వివరాల కోసం https://apcob.org/careers/ చూడండి.