ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే కష్టసాధ్యమైన పని. అయితే, ఈ యువతి మాత్రం ఒకే ఏడాది ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఆమె.. అదిలాబాద్ జిల్లా, తలమడుగు మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన బండారి మౌనిక. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఆమె ఈ కొలువులన్నీ సాధించడం విశేషం.
మౌనిక.. అమ్మానాన్న నిరక్షరాస్యులు. ఉన్న కాస్త పొలంలోనే వ్యవసాయం చేస్తుంటారు. ఆమెను చదివించాలన్నా, రేపొద్దున పెళ్లి చేయాలన్నా.. అదే వారికి ఉపాధి. కుటుంభం ఆర్థిక పరిస్థితి అంతంత మాతరం ఉండడంతో.. ఒకటో తరగతి నుంచి పది వరకూ సొంతూళ్లోనే చదువుకుంది. పదో తరగతిలో మంచి మార్కులు రావటంతో బాసర ట్రిపుల్ ఐటీలో ఇంటిగ్రేటెడ్ బీటెక్ (సీఎస్ఈ) లో చేరింది. ఇంజినీరింగ్ పూర్తవగానే ప్రభుత్వ కొలువు సాధించడమే లక్ష్యంగా పోటీ పరీక్షలపై దృష్టి పెట్టింది. ఒకవైపు ఇంటిపనులు చేస్తూనే.. సన్నద్ధమవుతూ వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రకటన రాగానే ప్రతి నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసేది. ఈ కక్రమంలో వరుసపెట్టి ఐదు ఉద్యోగాలు సాధించింది.
మొదటిసారి.. 2019 జూన్ లో పంచాయతీ కార్యదర్శి పోస్టుకు ఎంపికైంది. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని కూర గ్రామంలో కొద్దిరోజులపాటు ఆ ఉద్యోగం చేసింది. తర్వాత ఆసిఫాబాద్ మండలంలోని ఆడలో వీఆర్డీఓగా పనిచేసింది. అనంతరం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా ఎంపికైనా ఆ కొలువులో చేరలేదు. కొద్దిరోజులకే రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా ఎంపికైంది. ఇక.. చివరగా 2019 అక్టోబరులో గ్రూప్-2 ఉద్యోగం వాణిజ్య పన్నుల శాఖలో అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (ఏసీటీఓ) పోస్టుకు ఎంపికైంది.
మౌనిక సాధించిన ఉద్యోగాలు
1. పంచాయతీ కార్యదర్శి
2. వీఆర్ ఓ
3. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్
4. రెవెన్యూలో జూనియర్ అసిస్టెంట్
5. వాణిజ్య పన్నుల శాఖలో ఏసీటీఓ
ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు.. జీవితం ఆనందంగా గడపొచ్చు అనుకుంటున్న ఈరోజుల్లో.. ఐదు ఉద్యోగాలు సాధించిన ఈ యువతిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: తెలంగాణ ఎస్ఐ అభ్యర్థులకు శుభవార్త.. ప్రతి ఒక్కరికీ 8 మార్కులు..
ఇదీ చదవండి: HDFC స్కాలర్‌షిప్.. 1వ తరగతి నుంచి పీజీ వరకు అందరూ అర్హులే..!