హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2022-23 విద్యా సంవత్సరానికిగాను అర్హులైన విద్యార్థుల నుంచి కింది స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులు కోరుతోంది. ఈ స్కాలర్‌షిప్ పథకం ద్వారా సమాజంలోని అణగారిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత అందిస్తోంది. ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 1వ తరగతి మొదలు డిగ్రీ, పీజీ చదువులను అభ్యసించే విద్యార్థుల కోసం ఉద్దేశించింది. చదుతున్న తరగతులను బట్టి స్కాలర్‌షిప్ ఉంటుంది. కనిష్టంగా 1వ తరగతి చదువుతున్న వారికి రూ. 15,000 ఉండగా గరిష్ఠంగా పీజీ చదువుతున్న వారికి రూ.75,000 వరకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ప్రముఖ బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్ అయిన HDFC బ్యాంక్, తన ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ - ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్‌షిప్ లో భాగంగా ఈ స్కాలర్‌షిప్‌ను ప్రవేశపెట్టింది. అప్లై చేయడానికి ఈ నెల 31 ఆఖరు తేదీ. హెచ్‌డీఎఫ్‌సీ పరివర్తన్ స్కూల్ స్కాలర్‌షిప్ ప్రోగ్రాం అర్హత: కనీసం 55 శాతం మార్కులతో 1-12 తరగతి ఉత్తీర్ణత. స్కాలర్‌షిప్: 1-6వ తరగతి వరకు రూ.15000, 7-12వ తరగతి వరకు రూ.18000 చెల్లిస్తారు. హెచ్‌డీఎఫ్‌సీ పరివర్తన్ అండర్ గ్రాడ్యుయేషన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రాం అర్హత: కనీసం 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేన్ చదువుతున్న వారు అర్హులు. 10, 12వ తరగతి, డిప్లొమా చేస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. స్కాలర్‌షిప్: డిప్లమా వారికి రూ.20,000, అండర్ గ్రాడ్యుయేషన్-రూ.30,000, ప్రొఫెషనల్ కోర్సులు-రూ.50,000 చెల్లిస్తారు. సాధారణ కోర్సులు- BCom, BSc, BA, BCA మొదలైనవి. ప్రొఫెషనల్ కోర్సులు- BTech, MBBS, LLB, B Arch, Nursing ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన కళాశాలలు లేదా విశ్వవిద్యాలయాలలో చదివిన వారు మాత్రమే అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2.50 లోపు ఉండాలి. హెచ్‌డీఎఫ్‌సీ పరివర్తన్ పీజీ స్కాలర్‌షిప్ ప్రోగ్రాం అర్హత: కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ/ పీజీ చదువుతున్న వారు అర్హులు. స్కాలర్‌షిప్: పీజీ కోర్సులు చేస్తున్న వారికి రూ.35,000, ప్రొఫెషనల్ పీజీ కోర్సులు-రూ.75,000 చెల్లిస్తారు. సాధారణ కోర్సులు- MCom, MA మొదలైనవి. ప్రొఫెషనల్ కోర్సులు- MTech, MBA మొదలైనవి. ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన కళాశాలలు లేదా విశ్వవిద్యాలయాలలో చదివిన వారు మాత్రమే అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2.50 లోపు ఉండాలి. ఎంపిక విధానం: అభ్యర్థుల కుటుంబ ఆర్థిక అంశాలను పరిగణలోకి తీసుకుని, సంస్థ నిబంధనల ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 31, 2022 పూర్తి వివరాలకు, అప్లయ్ చేయడానికి ఇక్కడ HDFC Bank Parivartan’s ECS Scholarship 2022-23 క్లిక్ చేయండి. ఇదీ చదవండి: LIC: విద్యార్థులకు శుభవార్త.. 20,000 వరకు స్కాలర్‌షిప్ పొందే అవకాశం.. ఇలా అప్లై చేసుకోండి ఇదీ చదవండి: HCL TechBee: ఇంటర్‌తో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు.. ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం కల్పిస్తారు!