ఐపీఎల్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ప్రస్తుతం మ్యాచ్ జరుగుతుంది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(60) కాన్వే (40) మంచి శుభారంభం ఇచ్చినప్పటికీ.. మిడిల్ ఆర్డర్ ఆశించినంతగా రాణించలేదు. దీంతో భారీ స్కోర్ ఖాయమన్న చెన్నై ఒక మాదిరి స్కోర్ కే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చెన్నై అభిమానులు ఇప్పుడు ఒక ప్లేయర్ ని గుర్తు చేసుకుంటున్నారు.
ఐపీఎల్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ప్రస్తుతం మ్యాచ్ జరుగుతుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(60) కాన్వే (40) మంచి శుభారంభం ఇచ్చినప్పటికీ.. మిడిల్ ఆర్డర్ ఆశించినంతగా రాణించలేదు. దీంతో భారీ స్కోర్ ఖాయమన్న చెన్నై ఒక మాదిరి స్కోర్ కే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చెన్నై అభిమానులు ఇప్పుడు ఒక ప్లేయర్ ని గుర్తు చేసుకుంటున్నారు. అతడెవరో కాదు మిస్టర్ ఐపీఎల్ గా పేరొందిన సురేష్ రైనా. ప్రస్తుతం రైనా ఐపీఎల్ లో లేకపోయినా అతడిని చెన్నై గుర్తు చేసుకోవడానికి కారణమేంటో ఇప్పుడు చూద్దాం.
“సురేశ్ రైనా”.. టీమిండియా మాజీ ప్లేయర్, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 4 సార్లు ట్రోఫీ అందుకోవడంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి. రైనాకు ఐపీఎల్ లో చెన్నై జట్టుతో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ ఈ ఆటగాడికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. దాదాపు ప్రతి సీజన్ లో కనీసం 400 పరుగులు చేసి ఐపీఎల్ లో గ్యారంటీ బ్యాటర్ గా పేరుకి తెచ్చుకున్నాడు. ఈక్రమంలో ‘మిస్టర్ ఐపీఎల్’గా ట్యాగ్ ని సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ సీజన్ 2008 నుంచి ఎక్కువగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడిన రైనా.. ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు రైనాకు విడదీయరాని బంధం ఏర్పడింది. ధోనీని థలా.. అంటూ పిలుచుకునే సీఎస్కే ఫ్యాన్స్.. రైనాను చిన్న థలా అంటూ పిలుచుకుంటారు.
2008లో ఐపీఎల్లో ఆరంగేట్రం చేసిన రైనా 2021లో చివరి మ్యాచ్ ఆడాడు. మధ్యలో సీఎస్కేపై నిషేధం ఉన్న 2016, 17 సీజన్లలో మాత్రం అప్పటి గుజరాత్ లయన్స్ టీమ్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే 2022 సీజన్‌కు ముందు రైనాను చెన్నై సూపర్ కింగ్స్ రిటేన్ చేసుకోలేదు. ఆ తర్వాత మెగా వేలంలోనూ అతణ్ని తీసుకోకపోవడంతో రైనా ఆ సీజన్ ఆడలేకపోయాడు. చెన్నై తరఫున 176 మ్యాచ్‌లు ఆడిన రైనా 4687 రన్స్ చేశాడు. అందులో ఒక సెంచరీ, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక రైనా ప్లే ఆఫ్ లో రికార్డ్ చూసుకుంటే.. 24 ఇన్నింగ్ లో 714 పరుగులు చేసాడు. యావరేజ్ 37 గా ఉంటె స్ట్రైక్ రేట్ 155 ఉంది. ఇందులో 7 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైనాని గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.