మీరు నమ్మినా నమ్మకపోయినా సన్ రైజర్స్ జట్టు వరసగా రెండు మ్యాచ్ లు గెలిచేసింది. కోల్ కతాపై అసాధారణ రీతిలో బ్యాటింగ్ చేసి మరీ విజయం సాధించింది. కానీ ఆ భయం మాత్రం ఇంకా అలానే ఉండిపోయింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ వరసగా రెండు మ్యాచులు గెలిచింది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. వరసగా రెండు ఓటములతో ఈ సీజన్ ని స్టార్ట్ చేసిన రైజర్స్.. మొన్న పంజాబ్ పై, ఇప్పుడు కోల్ కతాపై అద్భుత విజయాలు సాధించింది. ఇప్పటివరకు అయిన మ్యాచులేమో గానీ తాజాగా ఈడెన్ గార్డెన్స్ లో మాత్రం రైజర్స్ చెలరేగింది. భారీ స్కోరు చేసి మరీ గెలిచింది. విమర్శిస్తున్న ప్రతి ఒక్కరూ అవాక్కయ్యేలా చేసింది. రూ.13 కోట్లు పెట్టి కొన్న బ్రూక్ బీభత్సం సృష్టించాడు. మ్యాచ్ గెలుపునకు కారణమయ్యాడు. అంతా బాగానే ఉన్నా ఓ విషయం మాత్రం గట్టిగా కొట్టేస్తుంది. చెప్పాలంటే సన్ రైజర్స్ ఫ్యాన్స్ ని తెగ భయపెడుతోంది.
అసలు విషయానికొస్తే.. తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి సన్ రైజర్స్ అంటే ఇష్టం. వార్నర్, విలియమ్సన్, ధావన్ లాంటి స్టార్స్ ఉన్నప్పుడు ఈ అభిమానం మొదలైంది. వీళ్లు వేరే జట్లకు వెళ్లిపోయినా సరే వాళ్లతోపాటు ప్రస్తుత హైదరాబాద్ జట్టుని అభిమానించేటోళ్లు ఉండనే ఉన్నారు. ప్రతిసారి సన్ రైజర్స్ పై ఫ్యాన్స్ కొద్దోగొప్పో ఆశలు పెట్టుకుంటూనే ఉన్నారు. కానీ ప్రదర్శన మాత్రం అంతంత మాత్రంగానే ఉంటూ వచ్చింది. ఈసారి వేలంలో మార్క్రమ్, బ్రూక్, క్లాసెన్ లాంటి విదేశీ ప్లేయర్లని కోట్లు పెట్టి కొన్నారు. అయినా సరే తొలి మూడు మ్యాచులు పెద్దగా వాళ్ల వల్ల అయితే గెలవలేదు. దీంతో ప్రతిఒక్కరూ ఈ జట్టుని విమర్శిస్తూ వచ్చారు. ఇప్పుడు వాటన్నింటికి కోల్ కతా మ్యాచ్ లో గెలిచి సమాధానమిచ్చారు.
ఈ సీజన్ కోసం హైదరాబాద్ జట్టు రూ.13 కోట్లు పెట్టి ఇంగ్లాండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ని హైదరాబాద్ దక్కించుకుంది. తీరాచూస్తే.. రాజస్థాన్ పై 13, లక్నోపై 3, పంజాబ్ పై 13 రన్స్ మాత్రమే కొట్టాడు. అరే 13 కోట్లు తీసుకుంటే 13 రన్స్ మాత్రమే కొడతావా? అని ప్రతిఒక్కరూ ట్రోల్ చేశారు. ఇప్పుడు ఈ బ్యాటరే కేకేఆర్ తో మ్యాచ్ లో సెంచరీ బాది రచ్చ చేశాడు. రైజర్స్ 228 స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. కెప్టెన్ మార్క్రమ్ 50, అభిషేక్ శర్మ 32 పరుగులతో తలో చేయి వేశారు. ఛేదనలో హైదరాబాద్ బౌలర్లు, ఫీల్డర్స్ ఘోరంగా అంటే ఘోరంగా ఆడారు. రన్స్ ఇచ్చేయడంతోపాటు బోలెడన్ని క్యాచ్ లు జారవిడిచారు. ఇదంతా చూస్తుంటే హైదరాబాద్ జట్టు పొరపాటున గెలిచేసినట్లు కనిపిస్తుంది.
ఎందుకంటే ఐపీఎల్ లో అత్యంత అనిశ్చితి(most inconsistency) ఉన్న టీమ్ ఏదైనా ఉందా అంటే అందరూ సన్ రైజర్స్ హైదరాబాద్ పేరు మాత్రమే చెబుతారు. ఎందుకంటే ఎప్పుడు గెలుస్తారో? ఎప్పుడు ఓడుతారో? అస్సలు అర్థం కాదు. ఈ సీజన్ నే తీసుకుంటే.. రాజస్థాన్ పై 131, లక్నోపై 121, పంజాబ్ పై ఛేదనలో 145 స్కోరు చేశారు. ఇప్పుడు కోల్ కతాపై ఏకంగా 228 రన్స్ కొట్టేశారు. ఇదంతా చూస్తుంటే.. సన్ రైజర్స్ జట్టు ప్రత్యర్థి జట్లతో కాదు ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకుంటుందా అనిపిస్తోంది. మరి సన్ రైజర్స్ ఆటతీరుపై మీరేం అంటారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.
This win will be remembered 🧡😉#OrangeFireIdhi #SRH #IPLT20 #Sunrisers #Hyderabad #ipl2023 pic.twitter.com/CS3KVsKO89
— SunRisers OrangeArmy Official (@srhfansofficial) April 14, 2023