ధోనీని చివరి బంతికి సిక్స్ కొట్టకుండా ఆపాలంటే.. ఆ బౌలర్ కి చాలా గట్స్ ఉండాలి. దాన్ని రియాలిటీలో ప్రూవ్ చేసి చూపించాడు సందీప్ శర్మ. అయితే ఈ సిక్స్ ఆపినందుకు కాదు ఓ విషయంలో మాత్రం ఇతడు నిజంగా హీరోనే.
చెన్నై-రాజస్థాన్ మ్యాచ్. చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ. ఛేదనలో చెన్నై బ్యాటింగ్ చూస్తే.. కచ్చితంగా ఓడిపోతారని చాలామంది అనుకున్నారు. చివరి 3 ఓవర్లలో 54 రన్స్ కొట్టాల్సిన స్థితిలో ధోనీ-జడేజా క్రీజులో ఉండేసరికి చెన్నై ఫ్యాన్స్ కి ఎక్కడో చిన్న ఆశ. అందుకు తగ్గట్లే ఈ ఇద్దరూ ఆచితూచి బ్యాటింగ్ చేస్తూ ఆల్మోస్ట్ గెలిపించేసినంత పనిచేశారు. చివరి బంతికి 5 రన్స్ కొట్టాలి. క్రీజులో ధోనీ ఉన్నాడు. సీఎస్కే గెలుపు కన్ఫర్మ్ అని దాదాపు ఫ్యాన్స్ అందరూ అనుకున్నారు. అలాంటి టైంలో బౌలర్ సందీప్ శర్మ తన ఎక్స్ పీరియెన్స్ ని బయటకు తీశాడు. ఎదురుగా ఉన్నది గ్రేటెస్ట్ ఫినిషర్ అని తెలుసు, అయినా సరే ఏ మాత్రం కంగారు పడకుండా యార్కర్ వేశాడు. ధోనీ దాన్ని డిఫెండ్ చేసి.. సింగిల్ రన్ మాత్రమే తీయగలిగాడు. దీంతో సందీప్ పేరు మార్మోగిపోతోంది. అసలు ఈ బౌలర్ సందీప్ శర్మ ఎవరు?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎవరికీ ఎప్పుడు అదృష్టం ఎలా కలిసొస్తుందో అస్సలు చెప్పలేం. సందీప్ శర్మ విషయంలోనూ తాజాగా అదే జరిగింది. టీమిండియా తరఫున అండర్-19 టీమ్ కు ఆడిన సందీప్.. 2011లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. పంజాబ్ జట్టు తరఫున ఎంతో అద్భుతమైన బౌలింగ్ చేశాడు. ఎన్నో మ్యాచుల్ని గెలిపించాడు. 2018లో సన్ రైజర్స్ లోకి వచ్చాడు. మన జట్టుకు కూడా చాలా ఉపయోగపడ్డాడు. కానీ ఈసారి వేలంలో అతడిని ఏ ఒక్క ఫ్రాంచైజీ కూడా కొనేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో చాలా బాధపడ్డాడు. ‘నేను ఎందుకు అమ్ముడుపోలేదో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఏ జట్టుకి ఆడినా సరే నా బెస్ట్ ఇచ్చాను. కానీ ఇలా జరగడం చాలా బాధాకరం’ అని సందీప్ చాలా ఆవేదన వ్యక్తం చేశాడు.
కట్ చేస్తే.. రాజస్థాన్ రాయల్స్ జట్టులోని ప్రసిద్ధ్ కృష్ణ గాయపడ్డాడు. అతడి స్థానంలో సందీప్ శర్మ ఎంట్రీ ఇచ్చాడు. టీమ్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏ మాత్రం మరిచిపోలేదు. అదే ఇప్పుడు సందీప్ ని హీరోని చేసింది. చెన్నైతో మ్యాచ్ లో కెప్టెన్ సంజూ శాంసన్ కు సందీప్ శర్మ స్టామినా ఏంటో తెలుసు కాబట్టి చివరి ఓవర్ బౌలింగ్ ఇచ్చాడు. దాన్ని ఇతడు తూచ తప్పకుండా అమలు చేశాడు. ప్రతి ఒక్కరితో శెభాష్ అనిపించుకుంటున్నాడు. ఒకవేళ సందీప్ వేసిన లాస్ట్ బాల్ కి ధోనీ సిక్స్ కొట్టుంటే.. ఇప్పుడు మెచ్చుకుంటున్న వాళ్లే అతడిని చాలా విమర్శించి ఉండేవారు. చెప్పాలంటే అసలు ఈ స్టోరీనే ఉండేది కాదు. సో అదన్నమాట మేటర్. అనుకోకుండా వచ్చిన అదృష్టం.. సందీప్ శర్మని హీరో చేసిందనే చెప్పాలి. మరి ధోనీ సిక్స్ కొట్టకుండా సందీప్ డిఫెండ్ చేయడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
Massive appreciation for Sandeep Sharma!
He was unsold in the auction, later RR picked him and he got the job done on the final ball by nailing a perfect Yorker! pic.twitter.com/bEalr6TJ04
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 12, 2023