సోషల్ మీడియాలో రాజస్థాన్ రాయల్స్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే వీరి సందడి మాత్రం ఒక్కోసారి హద్దుమీరుతుంది. అత్యుత్సాహంలో వారేం చేస్తారో కొన్ని సార్లు వారికే తెలియదు. తాజాగా నిన్న మ్యాచులో అలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఈ సారి ఏకంగా RRR మూవీనే అవమానిస్తూ ఒక పోస్టు పెట్టడం వైరల్ గా మారింది.
ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కి మిగతా జట్లతో పోలిస్తే ఫ్యాన్ ఫాలోయింగ్ కాస్త తక్కువగా ఉన్న మాట నిజమే. అయితే ఈ పింక్ జట్టు సోషల్ మీడియాలో మాత్రం బాగా సందడి చేస్తూ కనిపిస్తుంది. కాస్త వెటకారం జోడించి మీమ్స్ పోస్ట్ చేసే రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియా అకౌంట్లకి మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే వీరి సందడి మాత్రం ఒక్కోసారి హద్దుమీరుతుంది. అత్యుత్సాహంలో వారేం చేస్తారో కొన్ని సార్లు వారికే తెలియదు. దీంతో రాజస్థాన్ జట్టు ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా నిన్న మ్యాచులో అలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఈ సారి ఏకంగా RRR మూవీనే అవమానిస్తూ ఒక పోస్టు పెట్టడం వైరల్ గా మారింది.
ఐపీఎల్ లో భాగంగా నిన్న రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ జట్ల మధ్య జైపూర్ లో మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగింది. జైస్వాల్ ఔటైన తర్వాత గ్రీజ్ లోక్ వచ్చిన సంజు శాంసన్ రెచ్చిపోయి ఆడాడు. 38 బంతుల్లోనే 66 పరుగులు తీసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 5 సిక్సులు,4 ఫోర్లు ఉన్నాయి. ఇదిలా ఉండగా శాంసన్ ఇన్నింగ్స్ ని పొగిడే క్రమంలో రాయల్స్ టీమ్ కాస్త అతి ప్రదర్శించింది. SSS(స్కిప్పర్ సంజు శాంసన్)> RRR అని రాయల్స్ అడ్మిన్ పోస్ట్ చేసింది. మా వాడి బ్యాటింగ్ ట్రిపుల్ ఆర్ సినిమా కంటే ఎక్కువ అన్నట్లుగా ట్వీట్ చేసింది. కేవలం ఒక్క ఇన్నింగ్స్ తో ట్రిపుల్ ఆర్ సినిమాని తక్కువ చేసి మాట్లాడడం ఇప్పుడు ఎవ్వరు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై తెలుగు ప్రజలు మండిపడడమే కాకుండా ఏకంగా RRR టీం తనదైన శైలిలో స్పందించి అందరి నోళ్లు మూయించింది.
రాజస్థాన్ ట్వీట్ కి వెంకీ సినిమాలో బ్రహ్మానందం రవి తేజతో చెప్పే డైలాగ్” అవన్నీ నమ్మమంటే నువ్వు కూడా అడుక్కు తినాల్సిందేరా”అనే డైలాగ్ ని కామెంట్ చేయించి RRR మూవీ అధికారిక ట్విటర్ ఖాతా. అంతేకాదు RRR మూవీని నిర్మించిన డీవీవీ ఎంటర్టైన్మెంట్ సంస్థ కూడా దీనిపై దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. రవి తేజ నటించిన ఇడియట్ సినిమాలోని పోలీస్ స్టేషన్ లో “తొక్క తీస్తా”అంటూ పృద్వి చెప్పిన డైలాగ్ ని రిప్లై గా పోస్ట్ చేసింది. ఈ ట్వీట్ కి నిమిషాల వ్యవధిలోనే 3.1మిలియన్లతో పాటుగా 500 కి పైగా కామెంట్లు రావడంతో రాజస్థాన్ రాయల్స్ తప్పు తెలుసుకొని క్షమాపణలు చెప్పింది. ఈ సినిమా ప్రపంచమంతటా సక్సెస్ సాధించింది. అందుకే మేము క్షమాపణలు చెబుతున్నాం. SSS,RRR రెండూ గ్రేట్ అని ట్వీట్ చేసింది. మొత్తానికి ఏదో చేద్దామని ఇంకేదో చేసిన రాజస్థాన్ టీమ్ ఇప్పుడు పరువు పోగొట్టుకొని మూల్యం చెల్లించుకుంటుంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.