సిక్సర్ల స్టార్ రాహుల్ తెవాతియా లాస్ట్ ఓవర్లో బ్యాటింగ్ చేస్తున్నాడు అంటే ప్రత్యర్థికి వణుకు పుట్టాల్సిందే. ఇక తెవాతియా లాస్ట్ ఓవర్లో ఉంటే అవతలి జట్టుకు కష్టమే. ఇందుకు సంబంధించిన గణాంకాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
సాధారణంగా ఏ ఆటలోనైనా ఆటగాళ్లకు ఒత్తిడి అనేది ఉంటుంది. అయితే ఆ ఒత్తిడిని జయించినప్పుడే విజయం మన సొంతం అవుతుంది. అయితే దానిని జయించడం అంత తేలికైన విషయం కాదు. ఇక ఈ ఒత్తిడి క్రికెట్ లో అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఛేజింగ్ లో చివరి ఓవర్లో పరుగులు చేయాలి అంటే ఎన్నో గట్స్ ఉండాలి. తీవ్రమైన ఒత్తిడిని జయించాలి.. ఇది ఆటగాడికి కత్తిమీద సాము లాంటిదనే చెప్పాలి. కానీ ఈ విషయంలో ఓ బ్యాటర్ మాత్రం ప్రత్యర్థికి వణుకు పుట్టిస్తున్నాడనే చెప్పాలి. చివరి ఓవర్లో అతడు ఉన్నాడు అంటే ప్రత్యర్థి బౌలర్ గుండెలు గుబేల్ మనడం ఖాయమే. అతడే రాహుల్ తెవాతియా. ఇతడు లాస్ట్ ఓవర్లో బ్యాటింగ్ చేస్తున్నాడు అంటే జట్టు విజయం ఖాయం అయినట్లే లెక్క. అందుకు అతడి గణాంకాలే నిదర్శనం. మరి ఇప్పుడు ఆ లెక్క ఏంటో చూద్దాం.
రాహుల్ తెవాతియా.. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. అయితే అతి తక్కువ కాలంలోనే స్టార్ ఆల్ రౌండర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐపీఎల్ 2020 సీజన్ లో తొలుత రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహించాడు తెవాతియా. ఆ సీజన్ లో స్టార్ ఆల్ రౌండర్ గా ఒక్క వెలుగు వెలిగాడు. ఈ సీజన్ లో రాజస్థాన్ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు తెవాతియా. 18 బంతుల్లో 51 పరుగులు చేయాల్సిన క్రమంలో 7 బంతుల్లో 6 సిక్స్ లు కొట్టి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఆ తర్వాత పంజాబ్, ఢిల్లి జట్లకు ఆడిన తెవాతియా తనదైన బ్యాటింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. మరీ ముఖ్యంగా తెవాతియా లాస్ట్ ఓవర్ లో ఉన్నాడు అంటే ప్రత్యర్థి జట్టుకు గెలుపు దూరం అయినట్లే. ఈ విషయం ఏ ఒక్కసారో, రెండు సార్లో కాదు.. ఏకంగా 9 సార్లు రుజువు చేశాడు తెవాతియా.
ఈ క్రమంలోనే అతడు లాస్ట్ ఓవర్లో స్ట్రైక్ లో ఉన్న 10 మ్యాచ్ ల్లో 9 మ్యాచ్ లను గెలిపించాడు అంటేనే అతడు ఎంత డేంజరస్ బ్యాటరో అర్ధం అవుతుంది. 2022 సీజన్ లో కూడా సేమ్ పంజాబ్ జట్టుపైనే రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాది గుజరాత్ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. తాజాగా జరిగిన మ్యాచ్ లో ఫోర్ తో విన్నింగ్ షాట్ కొట్టి.. పంజాబ్ కు పీడకలను మిగిల్చాడు తెవాతియా. అయితే అతడు గతంలో పంజాబ్ జట్టుకు ఆడటం గమనార్హం. దాంతో పంజాబ్ కు తెవాతియాకు మధ్య లవ్ స్టోరీ ఉందంటూ.. సరదాగా కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. మరి డెత్ ఓవర్స్ లో డేంజరస్ బ్యాటర్ గా మారిన తెవాతియాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
2020: Hit six sixes in seven balls when RR needed 51 from 18
2022: Hit two sixes when GT needed 12 from 2
2023: Hit the winning four when GT needed 4 from 2
Rahul Tewatia: Punjab’s worst nightmare 😈 pic.twitter.com/AeOY8DvN2F
— ESPNcricinfo (@ESPNcricinfo) April 14, 2023
Rahul Tewatia GOD level finishing last season #PBKSvsGT pic.twitter.com/mbINWXDslE
— Jash (@JashPat02803650) April 13, 2023