ఐపీఎల్ లో అన్ని క్రికెట్ దేశాల ఆటగాళ్ళున్నా.. పాకిస్థాన్ క్రికెట్ ప్లేయర్లను మాత్రం ఈ లీగ్ కి దూరం పెట్టేసింది బీసీసీఐ. ఇక అప్పటినుంచి ఐపీఎల్ మీద పడి ఏడుస్తున్నారు.ఈ క్రమంలో వ్యూయర్‌షిప్ ను తగ్గించేందుకు ఒక కొత్త ప్లాన్ వేసింది.
ఐపీఎల్ సీజన్ 16 రేపటితో ముగిసిపోతుంది. ఈ నెల 31 న గ్రాండ్ గా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తో ప్రారంభమైన ఈ సీజన్ ఐపీఎల్.. ఆ రెండు జట్ల మధ్య రేపు జరగబోయే గ్రాండ్ ఫైనల్ తో ఎండ్ కార్డు పడనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు అభిమానులతో పాటు.. క్రికెట్ ఎక్స్ పర్ట్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ మేరకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఎన్నో థ్రిల్లింగ్ మ్యాచులతో ఈ సీజన్ ఐపీఎల్ మంచి సక్సెస్ అందుకుంది. ఇక మెగా ఫైనల్ లో వ్యూయర్‌షిప్ పరంగా కూడా కొత్త రికార్డులు బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు ఐపీఎల్ సక్సెస్ చూసి పాకిస్థాన్ తట్టుకోలేన్నట్లుగా కనబడుతుంది. వ్యూయర్‌షిప్ ను తగ్గించేందుకు ఒక కొత్త ప్లాన్ వేసింది.
ప్రపంచ క్రికెట్ లో లీగ్ లు ఎన్ని ఉన్నప్పటికీ.. ఐపీఎల్ కి ఉండే క్రేజ్ వేరు. ఈ రిచ్ లీగ్ లో ఆడేందుకు స్వదేశీ ప్లేయర్లతో పాటు.. విదేశీ ప్లేయర్లు కూడా ఆసక్తి చూపిస్తారు. అయితే ఐపీఎల్ లో అన్ని క్రికెట్ దేశాల ఆటగాళ్ళున్నా.. పాకిస్థాన్ క్రికెట్ ప్లేయర్లను మాత్రం ఈ లీగ్ కి దూరం పెట్టేసింది బీసీసీఐ. ఇక అప్పటినుంచి ఐపీఎల్ మీద పడి ఏడుస్తున్నారు పాక్ క్రికెట్ ఆటగాళ్లు. ఈ క్రమంలో పాక్ క్రికెట్ బోర్డు, ప్లేయర్స్ ఐపీఎల్ కి వస్తున్న పాపులారిటీని తట్టుకోలేక వీలు దొరికినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఐపీఎల్ వ్యూయర్‌షిప్ ని దెబ్బ తీయడానికి పాకిస్థాన్ కి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. సరిగ్గా ఐపీఎల్ ఫైనల్ రోజే వీరు ఒక మ్యాచ్ ఆడేందకు రెడీ అయిపోయారు. పాకిస్థాన్ సూపర్ లీగ్ లో విజేతగా నిలిచినా లాహోర్ జట్టుతో.. పాకిస్థాన్ అంతర్జాతీయ టీం మ్యాచ్ ఆడనుంది.
మే 28న బాబర్ సారధ్యంలో పాక్ జట్టు.. హరీస్ రౌఫ్ సారథ్యంలోని లాహోర్ ఖలాండర్స్ తలపపడనుంది. ఇదిలా ఉండగా లాహోర్ కెప్టెన్ షాహీన్ అఫ్రిది. అతడి కెప్టెన్సీలోనే లాహోర్.. వరుసగా రెండు సీజన్లు ట్రోఫీ నెగ్గింది. కానీ అతడిని కాదని ఫ్రెండ్లీ మ్యాచ్ లో హరీస్ రౌఫ్ కు సారథ్య పగ్గాలు అప్పజెప్పింది లాహోర్. ఈ మేరకు లాహోర్ ఖలాండర్స్.. తన అధికారిక ట్విటర్ ఖాతాలో పాకిస్తాన్ నేషనల్ టీమ్ తో ఆడబోయే జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్ తో పాటు స్థానిక ఆటగాళ్లు కూడా చోటు దక్కించుకున్నారు. అయితే పాకిస్తాన్ జాతీయ జట్టు మాత్రం లాహోర్ తో ఆడబోయే జట్టును ఇంకా ప్రకటించలేదు. పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో గల నరోవల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో మధ్యాహ్నం ఈ మ్యాచ్ జరుగనుంది. మొత్తానికీ ఐపీఎల్ – 16 ఫైనల్ కు కౌంటర్ గానే పీసీబీ ఈ నిర్ణయం తీసుకుందని పరోక్షంగా చెప్పకనే చెప్పింది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తలపండి.
🏏 LQ vs @TheRealPCB XI
📅2⃣8⃣ MAY
🕝2⃣:3⃣0⃣ PM
📍NAROWAL SPORTS COMPLEX pic.twitter.com/LAYQd890uM— Lahore Qalandars (@lahoreqalandars) May 26, 2023