ఈ సీజన్ ఐపీఎల్ లో నవీన్ ఉల్ హక్ అంటే తెలియని వారెవరూ ఉండరేమో. ప్రస్తుతం ముంబై తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచులో 4 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచులో నవీన్ ఉల్ హక్ సెలబ్రేషన్ వైరల్ గా మారింది.
ఐపీఎల్ లో భాగంగా నేడు ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 182 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టులో ఎవరూ కూడా అర్ధ అర్ధ సెంచరీ చేయకపోయినా.. తలో చేయి వేయడంతో లక్నో ముందు 183 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఎలిమినేటర్ మ్యాచ్ కానుండడంతో ఓడిపోయిన టీంకి మరో అవకాశం ఉండదు. దీంతో టోర్నీ నుండి నిష్క్రమించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో టైటిల్ రేస్ లో ఉండాలంటే ఇరు జట్లు కూడా తమ శక్తికి మించి ఆడాల్సి ఉంది. నిన్న జరిగిన క్వాలిఫయర్ 1 లో చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ మీద విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ రికార్డ్ స్థాయిలో 10 వ సారి ఐపీఎల్ ఫైనల్ కి దూసుకెళ్ళగా.. ఈ రోజు గెలిచిన జట్టు గుజరాత్ మీద క్వాలిఫయర్ 2 ఆడాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచులో నవీన్ ఉల్ హక్ సెలబ్రేషన్ వైరల్ గా మారింది.
ఈ సీజన్ ఐపీఎల్ లో నవీన్ ఉల్ హక్ అంటే తెలియని వారెవరూ ఉండరేమో. కోహ్లీతో గొడవ దగ్గరనుంచి ఈ ఆఫ్ఘనిస్తాన్ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. కేవలం మ్యాచుల్లో మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ ఉంటున్నాడు. ప్రస్తుతం ముంబై తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచులో 4 వికెట్లు తీసి సత్తా చాటాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు.. గ్రీన్, సూర్య కుమార్ యాదవ్, వధేరా వికెట్లు తీసుకొని ముంబై 200 మార్క్ టచ్ చేయకుండా ఆపాడు. ఇక ఈ మ్యాచులో వికెట్ తీసిన సమయంలో నవీన్ ఒక కొత్త సెలెబ్రేషన్ చర్చనీయాంశంగా మారింది. ఈ సెలెబ్రేషన్ అచ్చం గతంలో కేఎల్ రాహుల్ ని పోలి ఉండడం విశేషం. ప్రస్తుత జట్టులో రాహుల్ లేని కారణంగా రాహుల్ కి ట్రిబ్యూట్ ఇచ్చేందుకే నవీన్ ఇదంతా చేసి ఉండొచ్చని అనుకుంటున్నారు. మరి ఇదే కారణమా లేకపోతే వేరే కారణం ఉందేమో తెలియాల్సి ఉంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.