గత రెండు రోజులుగా లో స్కోరింగ్ థ్రిల్లర్ మ్యాచులు జరుగుతూ వస్తున్న ఐపీఎల్ లో.. నిన్న బ్యాటర్లు పరుగుల వరద పారించారు. మొహాలీ వేదికగా జరిగిన ఈ మ్యాచులో మొదట పంజాబ్ ఆ తర్వాత ముంబై బౌండరీల వర్షం కురిపించారు. దీంతో ఈ ఐపీఎల్ లో వరుసగా రెండో విజయాన్ని అందుకున్న రోహిత్ సేన ఈ క్రమంలో ఒక అరుదైన రికార్డ్ సృష్టించింది.
ఐపీఎల్ లో ముంబై జట్టు అదరగొడుతుంది. బౌలింగ్ లో మరోసారి తన బలహీనత బయటపెట్టిన ముంబై ఇండియన్స్.. ఆ తర్వాత బ్యాటింగ్ లో విధ్వంసం సృష్టించింది. పంజాబ్ విధించిన 215 పరుగులు లక్ష్యాన్ని అవలీలగా ఊదేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ మినహాయించి మిగిలి బ్యాటర్లందరూ చెలరేగి ఆడారు. దీంతో మరో 7 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకొని పంజాబ్ మీద ప్రతీకారం తీర్చుకుంది. దీంతో ఈ ఐపీఎల్ లో వరుసగా రెండో విజయాన్ని అందుకున్న రోహిత్ సేన ఈ క్రమంలో ఒక అరుదైన రికార్డ్ సృష్టించింది.
గత రెండు రోజులుగా లో స్కోరింగ్ థ్రిల్లర్ మ్యాచులు జరుగుతూ వస్తున్న ఐపీఎల్ లో.. నిన్న బ్యాటర్లు పరుగుల వరద పారించారు. మొహాలీ వేదికగా జరిగిన ఈ మ్యాచులో మొదట పంజాబ్ ఆ తర్వాత ముంబై బౌండరీల వర్షం కురిపించారు. టాస్ ఒడి మొదట బ్యాటింగ్ కి దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 214 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ప్రారంభంలో ధావన్(30), షార్ట్(27) ఆచితూచి ఆడగా..లివింగ్ స్టోన్(82), జితేష్ శర్మ(49) ముంబై బౌలర్ల మీద నిర్ధాక్షిణంగా విరుచుకుపడ్డారు. ఇక లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ రోహిత్ వికెట్ కోల్పోయినా .. కిషాన్, గ్రీన్(23) ఇన్నింగ్స్ ని ముందుకు తీసుకెళ్లారు. ఇక ఆ తర్వాత కిషాన్ (75)కి జత కలిసిన సూర్య(66) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముంబై గెలవడానికి వీరిద్దరి భాగస్వామ్యమే కారణం. ఇక వీరిద్దరూ చివర్లో ఔటైనా తిలక్ వర్మ(26), టిమ్ డేవిడ్(19) తమ పనిని పూర్తి చేశారు.
ఇక ఈ మ్యాచ్ ద్వారా ముంబై ఐపీఎల్ చరిత్రలో తొలిసారి 200 పరుగుల టార్గెట్ ని రెండు సార్లు చేధించిన జట్టుగా నిలిచింది. ఇప్పటివరకు ఏ జట్టు కూడా వరుసగా 200 పరుగుల లక్ష్యాన్ని రెండు సార్లు ఛేజ్ చేయలేకపోవడం గమనార్హం. ఈ అరుదైన ఘనత ముంబై ఇండియన్స్ కే దక్కడం విశేషం. ఇంతకు ముందు జరిగిన మ్యాచులో రోహిత్ సేన రాజస్థాన్ రాయల్స్ మీద 212 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. తాజాగా నిన్న జరిగిన మ్యాచులో కూడా 200 పైగా లక్ష్యాన్ని అవలీలగా కొట్టేసింది. మొత్తానికి బౌలింగ్ లో వీక్ గా కనబడుతున్న ముంబై టీమ్ బ్యాటింగ్ లో మాత్రం సత్తా చాటుతూ రికార్డులు సృష్టిస్తుంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.