సాధారణంగా భారీ స్కోర్లు నమోదైన మ్యాచులో మ్యాచ్ చివరి వరకు వెళ్లడం మనం చూస్తూ ఉంటాం.కానీ ముంబై ఇండియన్స్ కి అది పెద్ద సమస్య కాదు. ఎంత పెద్ద లక్ష్యాన్ని అయినా అలవోకగా కొట్టేస్తుంది. ఈ క్రమంలో రోహిత్ సేన ఒక అరుదైన రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది.
ఈ సీజన్ ఐపీఎల్ లో స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ కలిగిన టీం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ పేరే వినిపిస్తుంది. ఓపెనర్లు మొదలుకొని లోయర్ ఆర్డర్ వరకు ఆ జట్టు స్టార్లతో నిండి ఉంటుంది. బౌలింగ్ కాస్త బలహీనంగా ఉన్న మాట నిజమే అయినా.. బ్యాటింగ్ తో ఆ లోపాన్ని కవర్ చేస్తుంది. మొదట బ్యాటింగ్ చేస్తే కనీసం 200 స్కోర్, ఛేజింగ్ లో అయితే ఎంతైనా కొట్టేస్తాం అన్నట్లుగా కనిపిస్తుంది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చూస్తే పూర్వవైభం వచ్చినట్లుగానే కనిపిస్తుంది. ఎంత పెద్ద లక్ష్యాన్ని అయినా అలవోకగా కొట్టేస్తుంది. ఈ క్రమంలో రోహిత్ సేన ఒక అరుదైన రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది.
రోహిత్ శర్మ, కిషన్, సూర్య కుమార్ యాదవ్, టిం డేవిడ్, గ్రీన్, తిలక్ వర్మ వీరిలో తిలక్ వర్మ మినహాయిస్తే అందరూ ఇంటర్నేషనల్ స్టార్లే. తిలక్ వర్మ ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడకపోయినా.. ఐపీఎల్ లో సత్తా చాటుతున్నాడు. ఐపీఎల్ ముందు నుంచి ముంబై జట్టు బ్యాటింగ్ లైనప్ మీద చాలానే అంచనాలున్నాయి. దానికి తగ్గట్టే ఆడుతూ రికార్డులు కొల్లగొడుతుంది. టోర్నీ ప్రారంభంలో కాస్త తడబడినా.. క్రమంగా జూలు విదిలిస్తుంది. ఈ క్రమంలో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్న ముంబై ఇండియన్స్ తాజాగా.. మరో సరి కొత్త రికార్డును నెలకొల్పింది.
ఐపీఎల్ లో భాగంగా నిన్న బెంగళూరుతో, ముంబై తలపడిన సంగతి తెలిసిందే. వాంఖడేలో జరిగిన ఈ హై స్కోరింగ్ మ్యాచులో ముంబై అలవోక విజయం సాధించింది. సాధారణంగా భారీ స్కోర్లు నమోదైన మ్యాచులో మ్యాచ్ చివరి వరకు వెళ్లడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఆర్సీబీతో జరిగిన నిన్న మ్యాచులో 200 పరుగుల లక్ష్యాన్ని మరో 21 బంతులుండగానే చేధించింది. ఐపీఎల్ చరిత్రలో ఇలా ఒక జట్టు 200 స్కోర్ ని 21 బంతులుండగానే ఛేదించడం ఇదే తొలిసారి. ఈ ఘనత ముంబై ఇండియన్స్ కే దక్కింది. ముంబై పంజాబ్ తో జరిగిన గత మ్యాచులో కూడా 215 లక్ష్యాన్ని సింపుల్ గా కొట్టేసింది. ప్రతి మ్యాచులో బౌలర్లు విఫలమై భారీ స్కోర్ ఇవ్వడం.. లక్ష్యాన్ని ముంబై తడబడకుండా ఛేదించడం అలవాటుగా మారిపోయింది. మరి ఈ బ్యాటింగ్ లైనప్ తో ముంబై మరిన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.