ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం చాలా కొద్దీ మందికి మాత్రమే సాధ్యం. ఈ విషయంలో ధోని మొదటి వరుసలో నిలుస్తాడు. ఇదిలా ఉండగా.. మహేంద్రుడు చేసిన పని ఇప్పుడు ముచ్చట గొలిపేలా ఉంది. ఈ సంఘటనతో ధోనిలో కూడా ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడని తెలియజేసింది.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఏం చేసినా అందులో ఏదో ప్రత్యేకత ఉంటుంది. ధోని తీసుకునే అనూహ్య నిర్ణయాలు కూడా ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. మైదానంలో ఎంతో ప్రశాంతంగా, షార్ప్ గా కనపడే ధోని , బయట మాత్రం చాలా ఫ్రెండ్లీగా, సింపుల్ గా ఉంటాడు. ఈ లక్షణమే చాలా మంది అభిమానులను మిస్టర్ కూల్ కి దగ్గర చేసింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం చాలా కొద్దీ మందికి మాత్రమే సాధ్యం. ఈ విషయంలో ధోని మొదటి వరుసలో నిలుస్తాడు. ఇదిలా ఉండగా.. మహేంద్రుడు చేసిన పని ఇప్పుడు ముచ్చట గొలిపేలా ఉంది. ఈ సంఘటనతో ధోనిలో కూడా ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడని తెలియజేసింది. ఈ దృశ్యం చెన్నై-లక్నో మ్యాచ్ అనంతరం కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
సోమవారం చెన్నై సూపర్ కింగ్స్, లక్నో జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. చెన్నై విజయం సాధించిన ఈ మ్యాచ్ లో కెప్టెన్ ధోని చివరి ఓవర్లో కొట్టిన రెండు సిక్సులు మ్యాచ్ మొత్తానికే హైలెట్ గా నిలిచాయి. ధోని బ్యాటింగ్ కి వస్తుండగా అభిమానులు “ధోని.. ధోని” అనే నినాదాలు చేయడం మొదలు పెట్టారు. ఇక ఈ మ్యాచులో మరొక విషయంలో కూడా మిస్టర్ కూల్ అందరి మనసు దోచుకున్నాడు. చెన్నైలో జరిగిన ఈ మ్యాచ్ చూడడానికి లక్నో ఆటగాడు అయిన కృష్ణప్ప గౌతమ్ భార్య.. కూతురితో కలిసి మ్యాచ్ చూడటానికి వచ్చింది. ఇక మ్యాచ్ అనంతరం లక్నో సూపర్ జయింట్స్ ఆటగాడు కృష్ణప్ప గౌతమ్ కూతురుకి ధోని తన స్టయిల్లో హై ఫైవ్ ఇవ్వడం అందరికీ చాలా సంతోషాన్ని కలిగించింది. ధోని కూడా ఒక చిన్న పిల్లాడిలా మారిపోయి పాపతో కాసేపు సందడి చేస్తూ కనిపించాడు. దీంతో లక్నో ఆటగాడు కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఇక ఈ పిక్ చూసిన అభిమానులు చాలా క్యూట్ గా ఉందని సంబరపడుతున్నారు.
ఇక ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ రెండు మ్యాచుల్లో ఒక విజయాన్ని సొంతం చేసుకొని పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. తొలి మ్యాచులో గుజరాత్ టైటాన్స్ తో ఓడిపోగా, సొంత గడ్డపై జరిగిన మ్యాచ్ లో లక్నో పై ఘన విజయాన్ని అందుకుంది. ఇక ఇదే జోరు కొనసాగించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 5 వ సారి టైటిల్ మీద కన్నేసిన చెన్నై సూపర్ కింగ్స్ గెలిస్తే అత్యధిక ఐపీఎల్ టైటిళ్లు అందుకున్న జట్టుగా ముంబై తో సమంగా నిలుస్తుంది. మొత్తానికి ధోని.. గౌతమ్ కూతురికి హై ఫైవ్ ఇవ్వడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
A Cute #Yellovely reunion 💛🤗#CSKvLSG #WhistlePodu 🦁 pic.twitter.com/KtDq4sGvsN
— Chennai Super Kings (@ChennaiIPL) April 3, 2023