IPL 2023లో భాగంగా సోమవారం చెన్నై సూపర్ కింగ్స్-లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో చివరి ఓవర్లో బ్యాటింగ్ కు దిగాడు మిస్టర్ కూల్ ధోని. అయితే ధోని ఊరమాస్ క్రేజ్ అంటే ఏంటో తెలిసొచ్చింది ఐపీఎల్ 2023కు.
IPL 2023.. అభిమానుల అంచనాలకు తగ్గట్లుగానే ముందుకు సాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లు ఏవీ కూడా క్రికెట్ ఫ్యాన్స్ ను నిరాశకు గురిచేయలేదు. బ్యాటర్లు ఫోర్లు, సిక్స్ లతో చెలరేగుతుంటే.. బౌలర్లు తమ బంతులతో చెమటలు పట్టిస్తున్నారు. సమవుజ్జీల సమరంగా ఐపీఎల్ 2023 మెగా టోర్నీ ముందుకు సాగుతోంది. ఇక ఈ టోర్నీ మెుత్తాన్ని ఫ్రీగా స్ట్రీమింగ్ చేస్తోంది జియో సినిమా, జియో టీవీ యాప్ లు. దాంతో అభిమానులకు మరింతగా ఐపీఎల్ చేరుకుంది. ఈ క్రమంలోనే IPL 2023లో భాగంగా సోమవారం చెన్నై సూపర్ కింగ్స్-లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో చివరి ఓవర్లో బ్యాటింగ్ కు దిగాడు మిస్టర్ కూల్ ధోని. అయితే ధోని ఊరమాస్ క్రేజ్ అంటే ఏంటో ఇప్పుడు తెలిసొచ్చింది ఐపీఎల్ కు.
IPL 2023లో భాగంగా సోమవారం చెన్నై సూపర్ కింగ్స్-లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై ఓపెనర్లు లక్నో బౌలర్లకు చుక్కలు చూపించారు. తొలి వికెట్ కు కేవలం 9 ఓవర్లలోనే 110 పరుగులు జోడించి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. అనంతరం వచ్చిన బ్యాటర్లు కూడా తమ బ్యాట్ ఝళిపించడంతో.. 7 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక ఈ మ్యాచ్ లో ఓ అరుదైన రికార్డు నమోదు చేశాడు ధోని. అదేంటంటే?
ఇప్పటి వరకు ఐపీఎల్ 2023 సీజన్ లో జియో సినిమా యాప్ లో అత్యధిక వ్యుయర్ షిప్ నమోదు అయ్యింది. అదికూడా ధోని బ్యాటింగ్ కు వచ్చిన చివరి ఓవర్లో. ధోని చివరి ఓవర్లో బ్యాటింగ్ వచ్చాడు ఈ క్రమంలో జియో సినిమా టీవీలో అక్షరాల ఒక కోటీ 70 లక్షల మంది అప్పుడు మ్యాచ్ ను వీక్షించారు. ఇది ఐపీఎల్ 2023లో అత్యధిక వ్యుయర్ షిప్ గా నమోదు అయ్యింది. పవర్ హిట్టింగ్ చేసిన ధోని 2 సిక్స్ లతో 3 బంతుల్లో 12 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ లో ధోని 5000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇక జియో సినిమా, జియో టీవీ యాప్ లల్లో ఈ ఐపీఎల్ ను ఉచితంగా ప్రసారం చేస్తమని జియో ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ధోని బ్యాటింగ్ అప్పుడే ఈ రికార్డు నమోదు కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.