ఐపీఎల్ లో గాయం తర్వాత.. ఈ మెగా టోర్నీతో పాటు డబ్ల్యూటీసి ఫైనల్ కి దూరమయ్యాడు రాహుల్. దీంతో సర్జరీ కోసం లండన్ కి వెల్లడైన రాహుల్.. సర్జరీ విజయవంతంగా ముగించుకున్నాడు. అయితే తాజాగా.. ఒక క్లబ్ లో డ్యాన్స్ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసాడు.
ఈ సీజన్ ఐపీఎల్ భారత స్టార్ ప్లేయర్లకు అసలు కలిసి రాలేదనే చెప్పాలి. గాయాల కారణంగా ఈ టోర్నీ ముందే పలువురు స్టార్ల రూపంలో దూరమవ్వగా.. టోర్నీ చివరి దశలో భారత స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ కి తీవ్ర గాయమైంది. ఐపీఎల్ లో లక్నో సూపర్ జయింట్స్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రాహుల్.. బౌండరీ రోప్ దగ్గర ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో రాహుల్ సర్జరీ కోసం ఇంగ్లాండ్ కి వెళ్ళాడు. సర్జరీ కూడా విజయవంతమైంది. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తాను బాగానే ఉన్నానని తెలియజేశాడు. అంతా బాగానే ఇప్పుడు రాహుల్ చేసిన ఒక పనికి అందరూ షాక్ అవుతున్నారు.
మొన్నటివరకు రాహుల్ పరిస్థితి ఏమి బాగాలేదనుకున్నారు. భార్య అథియా శెట్టి తో కలిసి లండన్ కి వెళ్లిన రాహుల్.. హర్మ్‌స్ట్రింగ్ సర్జరీ విజయవంతంగా పూర్తి అయ్యిందంటూ ఫోటోలను కూడా షేర్ చేశాడు. నడవడానికి కూడా కష్టపడుతున్న రాహుల్.. ఊతకర్రలు పట్టుకుని నడవడం చూసి ఈ స్టార్ బ్యాటర్ మీద కాస్త జాలి చూపించారు. అయితే సర్జరీ జరిగిన మాట నిజమే అయినా.. ఇప్పుడు రాహుల్ అక్కడ చేసే పని కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తుంది. లండన్‌లో లక్స్ ఓ స్ట్రిప్ క్లబ్లో డ్యాన్స్ చేస్తూ కనిపించాడు రాహుల్. స్ట్రిప్ క్లబ్ అంటే డ్యాన్స్‌లు పోల్ డ్యాన్స్ ఆడుతూ తమ ఒంటిపై ఉన్న దుస్తులను ఒక్కొక్కటిగా తీసేస్తారు.
ఇండియాలో ఇలాంటి క్లబ్‌లకు అనుమతి లేదు కానీ లండన్‌లో ఇవి చాలా నార్మల్. అయితే ఇలాంటి క్లబ్లో కెఎల్ రాహుల్ కనిపించడమే టీమిండియా అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీనికి సంబంధించి రాహుల్ మీద ఇప్పుడు మీమ్స్ వైరల్ అవుతున్నాయి. మోకాలికి గాయమైన ఇలా అడల్ట్ క్లబ్ కి వెళ్లాడంటే ‘అన్న మామూలోడు కాదురా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రాహుల్ భార్య కూడా అక్కడే ఉండడంతో భార్యతో కలిసి వెళ్లాడా? లేకపోతే ఒక్కడే వెళ్లాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి రాహుల్ అందరికీ కాస్త గట్టిగానే షాకిచ్చినట్టుగానే కనిపిస్తుంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలపండి.