ఐపీఎల్ 2023 లో క్లాసన్ ఫామ్ కొనసాగుతుంది. సహచర బ్యాటర్లందరూ విఫలమవుతున్నా.. తాను మాత్రం వన్ మ్యాన్ వారియర్ లాగా పోరాడుతున్నాడు. దీంతో ఒక రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్ లో భాగంగా ప్రస్తుతం సన్ రైజర్స్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. హైద్రాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ ఓడి సన్ రైజర్స్ బ్యాటింగ్ కి వచ్చింది. ఈ సీజన్ లో చెత్త ప్రదర్శన కొనసాగిస్తున్న సన్ రైజర్స్ బ్యాటర్స్ .. భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. ఓ వైపు బ్యాటర్లు అందరూ విఫలమవుతున్నా.. మరో ఎండ్ లో సన్ రైజర్స్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసన్ సెంచరీతో చెలరేగిపోయి ఆడాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకి 186 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక ఈ మ్యాచులో క్లాసన్ ఇన్నింగ్స్ హైలెట్ గా నిలిచింది.
ఐపీఎల్ 2023 లో క్లాసన్ ఫామ్ కొనసాగుతుంది. సహచర బ్యాటర్లందరూ విఫలమవుతున్నా.. తాను మాత్రం వన్ మ్యాన్ వారియర్ లాగా పోరాడుతున్నాడు. పరుగులు చేయడంతో పాటుగా మంచి స్ట్రైక్ రేట్ తో సన్ రైజర్స్ జట్టుకి ఆశాకిరణంలా మారాడు. తొలి బంతినుంచి ప్రత్యర్థి బౌలర్లపై ఎదురు దాడికి దిగిన క్లాసన్.. 8 ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో 51 బంతుల్లో 104 పరుగులు చేసాడు. దీంతో ఈ సీజన్ లో హైదరాబాద్ తరపున సెంచరీ చేసిన రెండో ప్లేయర్ గా నిలిచాడు. ఇదివరకే హరీ బ్రూక్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఓవరాల్ గా బెయిర్ స్టో, వార్నర్, బ్రూక్ ల తర్వాత సన్ రైజర్స్ తరపున సెంచరీ చేసిన నాలుగో విదేశీ ప్లేయర్ గా క్లాసన్ నిలిచాడు. మరి క్లాసన్ ఆడిన ఇన్నింగ్స్ మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.