ప్రపంచవ్యాప్తంగా చాట్ జీపీటీకి ఉన్న డిమాండ్ సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ లక్షల మంది వెయిటింగ్ లిస్టులోనే ఉన్నారు. అయితే ఈ చాట్ జీపీటీ మీద వ్యతిరేకత కూడా లేకపోలేదు. దీనిని బ్యాన్ చేయాలంటూ ఎప్పటినుంచో డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు చాట్ జీపీటీ విషయంలో కొత్త ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
చాట్ జీపీటీ.. ఈ ఓపెన్ ఏఐ చాట్ బాట్ గురించి ప్రపంచవ్యాప్తంగా రోజుకో వార్త వైరల్ అవుతూనే ఉంది. టెక్నాలజీ రంగంలోనే ఈ చాట్ బాట్ ఒక సంచలనం అని చెప్పాలి. ఇప్పుడు పెద్ద పెద్ద్ టెక్ కంపెనీలు కూడా కృతిమ మేథపైనే పెట్టుబడులుపెడుతున్నాయి. ఇప్పటికే గూగుల్ కూడా బార్డ్ పేరిట సొంత ఏఐ పవర్డ్ చాట్ బాట్ ని సిద్ధం చేశారు. మెటా సంస్థ కూడా ఈ కోవలోనే సొతం ఏఐ సాఫ్ట్ వేర్ తయారీకి పూనుకుంది. ఇప్పుడు ఎలన్ మస్క్ కూడా సొంత ఏఐ చాట్ బాట్ ని తయారు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ చాట్ జీపీటీ అంటే ఎంత క్రేజ్ ఉందో అంతే వ్యతిరేకత కూడా ఉంది. ఈ చాట్ బాట్ ని బ్యాన్ చేయాలంటూ గట్టిగానే డిమాండులు చేస్తున్నారు.
చాట్ జీపీటీ అంటే టెక్నాలజీలో ఒక పెను విప్లవమనే చెప్పాలి. దీనిని తయారు చేసిన ఓపెన్ ఏఐ సంస్థకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు లభించింది. అయితే ఈ చాట్ జీపీటీ మీద ఎంతో వ్యతిరేకత కూడా ఉంది. ఎందుకంటే ఇది మీ పనిని సులభం చేస్తుంది. ఎలాంటి కోడింగ్ తెలియకపోయినా మీరు ప్రోగ్రామ్ రాసేయచ్చు. జోక్స్, మ్యాథ్య్, బుక్స్, స్టోరీస్ ఇలా ఏదైనా ఈ చాట్ జీపీటీ సాయంతో మీరు రాసేయచ్చు. మీకు అందులో ప్రవేశం కూడా ఉండాల్సిన అవసరం లేదు. అందుకే ఈ చాట్ జీపీటీ అంటే అందరూ భయపడుతున్నారు. దీని ద్వారా తమ ఉద్యోగాలు పోతాయంటూ గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు తాను ఈ జాబ్స్ రీప్లేస్ చేయగలను అంటూ చాట్ జీపీటీనే ఓ 20 ఉద్యోగాల పేర్లు కూడా చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఉద్యోగాలకే కాదు.. సహజ వనరులకు కూడా చాట్ జీపీటీ వల్ల ముప్పు తప్పదని వార్తలు వస్తున్నాయ.
అమెరికా శాస్త్రవేత్తలు వేసిన ఒక అంచనా ఇప్పుడు అందరీ ఆలోజింపచేస్తోంది. ఎందుకంటే చాట్ జీపీటీ ప్రతి 20 ప్రశ్నలకు అర లీటరు మంచినీళ్లు ఖాళీ చేస్తోంది. అవును మీరు చదివింది నిజమే. చాట్ జీపీటీ లీటర్ల కొద్దీ మంచినీళ్లు ఖాళీ చేస్తోంది అంట. దీని సర్వర్లు పని చేసేందుకు విద్యుత్ కానివ్వండి, సర్వర్లను చల్లబరిచేందు కోసం కూడా నీళ్లు కావాలి. పైగా ఆ ప్రక్రియకు కేవలం మంచినీళ్లు మాత్రమే కావాలి. చాట్ జీపీటీకి శిక్షణ ఇచ్చేందుకే 7 లక్షల లీటర్ల మంచినీటి వాడటమే అందుకు ఉదాహరణ అంటున్నారు. ఈ లెక్కన చాట్ జీపీటీ వాడకం పెరిగితే ఇంకా ఎన్ని లక్షల లీటర్లు మంచినీళ్లు కావాలి? ఎన్ని చెరువులు, సరస్సులు, నదులు కావాలి? అంటూ నెట్టింట ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ కృతిమ మేథ వల్ల లాభాలు కంటే మనిషి మనుగడుకు నష్టాలే ఎక్కువగా ఉన్నాయంటూ పెదవి విరుస్తున్నారు. చాట్ జీపీటీ వల్ల మనిషికి లాభమా? నష్టమా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.