సోమవారం(ఏప్రిల్ 10)న జరిగిన మ్యాచ్ లో పలు రికార్డులు నమోదు అయ్యాయి. అందులో డుప్లెసిస్ నెలకొల్పినవే రెండు రికార్డులు కాగా.. ఒకటి పూరన్ నెలకొల్పాడు. ఈ క్రమంలోనే డుప్లెసిస్ ధోని రికార్డు బద్దలు కొట్టాడు. అయితే డుప్లెసిస్ బద్దలు కొట్టిన రికార్డు రన్స్ లో కాదు. మరి ఎందులో ఈ రికార్డు బ్రేక్ చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా క్రికెట్ లో రికార్డులకు ఆయుష్షు తక్కువ అన్న సంగతి మనందరికి తెలిసిందే. అదే ఐపీఎల్ లో అయితే గంటల వ్యవధిలోనే నెలకొల్పిన రికార్డులు తుడిచిపెట్టుకుపోతుంటాయి. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ 2023 సీజన్ లో వరుసగా రికార్డులు బద్దలు అవుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారం(ఏప్రిల్ 10)న జరిగిన మ్యాచ్ లో పలు రికార్డులు నమోదు అయ్యాయి. అందులో డుప్లెసిస్ నెలకొల్పినవే రెండు రికార్డులు కాగా.. ఒకటి పూరన్ నెలకొల్పాడు. ఈ క్రమంలోనే డుప్లెసిస్ ధోని రికార్డు బద్దలు కొట్టాడు. అయితే డుప్లెసిస్ బద్దలు కొట్టిన రికార్డు రన్స్ లో కాదు. మరి ఎందులో ఈ రికార్డు బ్రేక్ చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్ లో లక్నో-ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ లో పలు రికార్డులు నమోదు అయ్యాయి. అందులో రెండు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు దక్షిణాఫ్రికా స్టార్, ఆర్సీబీ ప్లేయర్ డుప్లెసిస్. ఇందులో ఓ రికార్డు ఐపీఎల్ 2023లోనే భారీ సిక్సర్. డుప్లెసిస్ 115 మీటర్ల భారీ సిక్సర్ బాదడంతో.. ఆ బంతి కాస్త స్టేడియం అవతల పడింది. దాంతో ఈ సీజన్ లో అత్యధిక దూరం సిక్సర్ బాదిన బ్యాటర్ గా డుప్లెసిస్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఇక మరో రికార్డు ఏంటంటే? ప్రస్తుతం టాటా ఐపీఎల్ 2023 సీజన్ ను జియో సినిమా ఉచితంగా స్ట్రీమింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దాంతో జియో యూజర్లు అందరు ఎగబడి ఐపీఎల్ మ్యాచ్ లను చూస్తున్నారు.
ఈక్రమంలోనే గతంలో ఉన్న వ్యూవర్ షిప్ రికార్డులను ప్రస్తుతం జియో బద్దలు కొడుతోంది. తాజాగా వ్యూవర్ షిప్ లో మిస్టర్ కూల్ ధోని రికార్డును బద్దలు కొట్టాడు డుప్లెసిస్. అయితే ఈ రెండు మ్యాచ్ ల్లో ప్రత్యర్థి లక్నో టీమ్ కావడం విశేషం. రెండు రోజుల క్రితం జరిగిన మ్యాచ్ లో లక్నో పై ధోని బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో జియో సినిమా యాప్ లో 1.7 కోట్ల ప్రేక్షకులు మ్యాచ్ ను ఒకేసారి చూశారు. ఇదే ఇప్పటి వరకు రికార్డు. తాజాగా జరిగిన మ్యాచ్ లో ఈ రికార్డును బద్దలు కొట్టాడు డుప్లెసిస్. డుప్లెసిస్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో 1.8 కోట్ల మంది ఒకే సారి జియో సినిమా యాప్ లో మ్యాచ్ ను వీక్షించారు. దాంతో సరికొత్త రికార్డు నమోదు అయ్యింది. ఇక వ్యూవర్ షిప్ రికార్డులో రెండు, మూడు స్థానాల్లో ధోని ఉండటం విశేషం. మరి ధోని వ్యూవర్ షిప్ రికార్డును డుప్లెసిస్ బద్దలు కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
JioCinema peak viewership:
1.8cr – Faf Du Plessis’ batting.
1.7cr – MS Dhoni’s batting.
1.6cr – MS Dhoni’s batting.– A 41 year old and a 38 year old dominates the league!
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 10, 2023