సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో రవీంద్ర జడేజా కోపంతో ఊగిపోయాడు. వికెట్ తీసిన ఆనందంలో సహనం కోల్పోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఐపీఎల్ 2023 సీజన్ ప్రేక్షకులకు అసలైన క్రికెట్ మజాను అందిస్తూ.. దూసుకెళ్తోంది. ఇక శుక్రవారం రాత్రి చెన్నైసూపర్ కింగ్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిరింది. ఈ మ్యాచ్ లో చెన్నై బౌలర్ రవీంద్ర జడేజా 3 వికెట్లతో చెలరేగాడు. దాంతో హైదరాబాద్ జట్టు 134 పరుగులకే కట్టడి అయ్యింది. స్వల్ప లక్ష్యాన్ని చెన్నై జట్టు 3 వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలో ఛేదించింది. ఇక ఈ మ్యాచ్ లో రవీంద్ర జడేజా కోపంతో ఊగిపోయాడు. వికెట్ తీసిన ఆనందంలో సన్ రైజర్స్ బ్యాటర్ పై అరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ఐపీఎల్ 2023లో భాగంగా.. శుక్రవారం చెన్నై-హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నైకి బౌలర్లు అదిపోయే ఆరంభాన్ని ఇవ్వకున్నా తర్వాత సమష్టిగా రాణించారు. చెన్నై బౌలర్ రవీంద్ర జడేజా తన స్పిన్ మాయాజాలంతో SRH బ్యాటర్లను బోల్తా కొట్టించాడు. 3 వికెట్లు తీసి హైదరాబాద్ జట్టును దెబ్బకొట్టాడు జడ్డూ భాయ్. ఇక ఈ మ్యాచ్ 14 ఓవర్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ను వేయడానికి రవీంద్ర జడేజా వచ్చాడు. బ్యాటింగ్ ఎండ్ లో మయాంక్ అగర్వాల్ ఉండగా.. బౌలింగ్ ఎండ్ లో క్లాసెన్ ఉన్నాడు. ఈ ఓవర్ లో జడేజా బంతిని తప్పుగా అంచనా వేసిన అగర్వాల్.. రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు.
అయితే ఆ క్యాచ్ ను అందుకునే క్రమంలో జడేజాకు నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న క్లాసెన్ అడ్డుగా వచ్చాడు. దాంతో ఒకరిని ఒకరు ఢీ కొనడంతో క్యాచ్ పట్టలేక పోయాడు జడ్డూ భాయ్. దానికి వెంటనే క్షమాపణలు చెప్పాడు క్లాసెన్. కానీ చూపులతో బెదరగొట్టాడు జడేజా. ఆ తర్వాత వెంటనే మయాంక్ స్టంపౌట్ కావడంతో.. క్లాసెన్ వైపు చూస్తూ.. ఇప్పుడేం చేస్తావ్ అని కోపంతో ఊగిపోయాడు జడేజా. వెంటనే ధోని వచ్చి జడ్డూను శాంతింప జేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఈ క్రమంలోనే వికెట్ పడిన ఆనందంలో జడేజా కోపంతో ఊగిపోయాడు. క్లాస్ న్ వైపు చూస్తూ.. వాట్ అంటూ గట్టిగా అరిచాడు. దాంతో అతడు కూడా జడేజా వైపు చూస్తూ.. క్రీజ్ చేరాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. అనంతరం చెన్నై జట్టు కేవలం 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని పూర్తి చేసింది. జట్టులో కాన్వే 77 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
Things heating up with Klassen vs Jadeja.
But #MSDhoni stamping next ball then #jadeja satisfaction #CSKvSRH pic.twitter.com/Zs4rVqlruH— TST Sports (The Sporty Trendy Sports) (@tst_sports) April 21, 2023
Action Reaction#jadeja pic.twitter.com/B81JZwx1Ar
— Seemi❣️ (@seemii_sen) April 21, 2023