ధోని.. ధోని.. ధోని ప్రస్తుతం ఎక్కడ చూసిన అభిమానులు ఈ పేరునే జపిస్తున్నారు. మాహీ మీద అభిమానులకి రోజు రోజు ఎక్కువవుతుందే కానీ అస్సలు తగ్గడం లేదు. అభిమానం అంటే ఇలా కూడా ఉంటుందా అని తమ డెడికేషన్ తో ఇప్పుడు అందరి మనసులని గెలుచుకుంటున్నారు.
ఐపీఎల్- 2023 లో ధోని ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఒక మనిషికి ఇంతలా ఫాలోయింగ్ ఉంటుందా అనే అనుమానం సగటు ప్రేక్షకుడికి కలిగింది. ముఖ్యంగా మిస్టర్ కూల్ కి ఇదే చివరి ఐపీఎల్ అని విపరీతమైన చర్చ నడుస్తున్న తరుణంలో ఫ్యాన్స్ ధోని మీద అంతులేని అభిమానం చూపిస్తున్నారు. గ్రౌండ్ ఏదైనా అక్కడ ధోని ఫ్యాన్స్ తో స్టేడియం నిండిపోతుంది. ఒకప్పుడు చెన్నైలో మాత్రమే ఇలాంటి వాతావరణం మనం చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ధోని ఎక్కడికి వెళితే ఫ్యాన్స్ అక్కడ వాలిపోతున్నారు. కింగ్ కోహ్లీకి భారీగా ఫాలోయింగ్ ఉన్న చిన్నస్వామి స్టేడియం సైతం చెన్నైతో మ్యాచ్ సందర్భంగా పసుపు కలర్ తో స్టేడియం హోరెత్తిందింది. ఇదిలా ఉండగా ఇప్పుడు ధోని ఫ్యాన్స్ చేసిన ఒక పని అతనంటే ఎంత ఇష్టమో తెలియజేస్తుంది.
ధోని.. ధోని.. ధోని ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ పేరునే జపిస్తున్నారు. మాహీ మీద అభిమానులకి రోజు రోజు ఎక్కువవుతుందే కానీ అస్సలు తగ్గడం లేదు. అభిమానం అంటే ఇలా కూడా ఉంటుందా అని తమ డెడికేషన్ తో ఇప్పుడు అందరి మనసులని గెలుచుకుంటున్నారు. ఇక వివరాల్లోకెళ్తే.. ఐపీఎల్ లో భాగంగా నిన్న జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ కి భారీ వర్షం అంతరాయం కలిగించిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లో జరగనున్న ఈ మ్యాచ్ కోసం అభిమానులు భారీగా తరలి వచ్చారు. ప్రతి సరి లాగే ధోని అభిమానులతో స్టేడియం మొత్తం ఎల్లో కలర్ తో నిండిపోయింది. అయితే అనూహ్యంగా ఈ మ్యాచ్ కి వరుణుడు విల్లన్ లా తయారయ్యాడు. దీంతో చెన్నై ఫ్యాన్స్ బాగా నిరాశ చెందారు.
అయితే మ్యాచ్ నిన్న వర్షం కారణంగా జరగకపోయినా ఈ రోజుని రిజర్వు డే ని ప్రకటించారు. దీంతో చెన్నై ఫ్యాన్స్ తో పాటు క్రికెట్ ప్రేమికులు ఈ రోజే మ్యాచ్ చూసే అవకాశం దక్కిందని సంతోషపడ్డారు. అయితే మ్యాచ్ తర్వాత రోజు జరగనుందని తెలిసి ధోని ఫ్యాన్స్ అహ్మదాబాద్ లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. కానీ ఖరీదైన హోటల్లో ఉండడడనికి వారి దగ్గర కావాల్సినన్ని డబ్బులు లేవు. దీంతో అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫామ్ మీద పడుకున్నారు. ఇది చూసిన ఒక వ్యక్తి ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ధోని మీద అభిమానులకి ఉన్న ప్రేమను చూసి షాకవుతున్నారు. ఒక ప్లేయర్ మీద అభిమానం చూపించడం కామన్. కానీ ఈ రేంజ్ లో అభిమానం అంటే అది కేవలం ధోనికి మాత్రమే సాధ్యం అనేలా అనిపిస్తుంది. మొత్తానికీ మరో సారి ధోని మీద అంతులేని అభిమానం చూపించి మరోసారి ధోని ఫ్యాన్సా.. మజాకా అనిపించారు. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.