కష్టాలకు, కన్నీళ్లలకు కరగకుండా వాటికి ఎదురొడ్డి నిలిచి ఇప్పుడు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ క్రికెటర్. ఓ అడ్డా కూలీగా, సేల్స్ మెన్ గా జీవితం ప్రారంభించి ఇప్పుడు ఐపీఎల్ స్టార్ గా వెలుగొందుతున్నాడు. యువతకు ఆదర్శంగా నిలుస్తున్న ఆ క్రికెటర్ జీవిత కథ ఇప్పుడు తెలుసుకుందాం.
కష్టం వచ్చిందని కన్నీరు కారుస్తూ.. కూర్చుంటే ఆ కష్టం కరిగిపోదు. వచ్చిన ఆ సమస్యను పట్టుదల, శ్రమ అనే ఖడ్గాలతో తెగ నరికి జీవితంలో ముందుకు సాగాలి. ప్రస్తుత యువతకు చిన్న చిన్న సమస్యలే.. ఎవరెస్ట్ అంత పెద్ద సమస్యలుగా కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి తరుణంలో మనం పెట్టుకున్న లక్ష్యాన్ని ఛేదించాలి అంటే.. ఎంతో దృఢ సంకల్పం ఉండాలి. అలాంటి దృఢ సంకల్పం ఉండబట్టే ఓ క్రికెటర్ కూలీగా, సేల్స్ మెన్ గా గొడ్డు కష్టం చేస్తూనే.. అంతర్జాతీయ క్రికెటర్ అవ్వాలన్న తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకున్నాడు. కష్టాలకు, కన్నీళ్లలకు కరగకుండా వాటికి ఎదురొడ్డి నిలిచి ఇప్పుడు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. తాాజాగా జరుగుతున్న ఐపీఎల్ లో సత్తా చాటి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. మరి యువతకు ఆదర్శంగా నిలుస్తున్న ఆ క్రికెటర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం కోసం తెగ కష్టపడతారు. ఎప్పుడూ ప్రాక్టీస్ చేస్తూ పూర్తిగా దాని మీదే ఫోకస్ పెట్టి చివరికి జట్టులో చోటు సంపాదించుకుంటారు. వీరందరి కష్టాన్ని మనం తీసి పారేయలేము. వారి కష్టానికి తగిన గౌరవం ఇవ్వాల్సిందే. దాదాపు చాలామంది కష్టపడి క్రికెట్లోకి వస్తే.. అరుదులో అరుదుగా కొంతమంది కష్టాలను తట్టుకొని అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెడతారు. ఇక క్రికెట్ లోకి రావాలంటే ఆసక్తి, పట్టుదల ఉంటే సరిపోతుందనుకుంటారు కొందరు. కానీ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా.. చేతిలో డబ్బు లేకపోయినా ఓ ఆటగాడు మాత్రం అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. అతడే ఆసీస్ క్రికెటర్ నాథన్ ఎల్లిస్.. అతడు క్రికెట్ లో ఎదిగిన తీరుకి మనం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
అతడి కెరీర్ ను ఓ సారి పరిశీలిస్తే.. 2018 లో తొలి సారి హోబర్ట్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడిన ఈ ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్.. 2021 లో బంగ్లాదేశ్ సిరీస్ తో తొలిసారి ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. తొలి మ్యాచ్ లోనే హ్యాట్రిక్ తీసి సంచలనం సృష్టించాడు ఎల్లిస్. ఆ తర్వాత ఇండియన్ రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ వికెట్ రెండు సార్లు తీసుకొని అందరి దృష్టిలో పడ్డాడు. బిగ్ బాష్ లీగ్ లో ప్రతి సీజన్లలో స్లో బాల్స్ వేస్తూ బ్యాటర్లను బోల్తా కొట్టించడంలో ఇతడు సిద్దహస్తుడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో తాజాగా రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 4 కీలక వికెట్లు తీసుకొని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఇంత అద్భుత ప్రదర్శన చేస్తున్న ఎల్లిస్ జీవితంలో అనేక కష్టాలు పడ్డాడను అని మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.
ఎల్లిస్ మాట్లాడుతూ “క్రికెట్లోకి రావడానికి నేను చాలా లేబర్ ఉద్యోగాలు చేసాను. సేల్స్ మెన్ గా ప్రతిరోజు ఉదయం ఇంటింటికీ వెళ్ళేవాడిని. ఇది నాకు చాలా భయంకరంగా అనిపించేది. అంతే కాదు కన్ స్ట్రక్షన్ వర్క్ చేసేటప్పుడు చాలా అలిసి పోయేవాడిని. ఓ వైపు క్రికెట్ ట్రైనింగ్ తీసుకుంటూ.. మరో వైపు డబ్బు కోసం ఏదో ఒక చిన్న ఉద్యోగం చేశావాడిని. కొన్ని సార్లు శారీరకంగానే కాదు మానసికంగా నేను చాలా అలిసిపోయేవాడిని. కానీ ప్రస్తుతం నా ప్రదర్శన పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాను” అంటూ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చాడు నాథన్ ఎల్లిస్. మరి ఇన్ని కష్టాలు అనుభవించి అంతర్జాతీయ క్రికెట్లో ఎల్లిస్ సత్తా చాటడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.