రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ ఏడాది ఐపీఎల్‌లో చాలా దారుణంగా విఫలం అవుతున్నాడు. ఒక సీజన్‌లో అత్యధిక సెంచరీలు చేసిన వీరుడు.. ఈ సీజన్‌లో మాత్రం వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గోల్డెన్ డక్ అయ్యాడు. చాలా కాలంగా సరైన ఫామ్‌లో లేడు. దీంతో కోహ్లీపై ఒత్తిడి పెరుగుతూ వస్తుంది. ఈ సీజన్‌లో ఆర్సీబీ మంచి ప్రదర్శన కనబరుస్తున్నా.. కోహ్లీ ఫెల్యూయిర్ మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా సజరైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో కేవలం 68 పరుగులకే ఆలౌట్ అయ్యి.. ఈ సీజన్‌లోనే అత్యంత తక్కువ టోటల్‌ను నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ.. జన్‌సేన్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అయ్యాడు. దీంతో కోహ్లీ.. కొద్దిసేపు అలానే షాక్‌లో ఉండిపోయాడు.. నాకే ఎందుకిలా జరుగుతుంది అన్నట్లు ఆకాశం వైపు చూస్తూ.. పెవిలియన్ చేరాడు.
కోహ్లీ ఫెల్యూయిర్‌పై విమర్శలు వచ్చినా.. మరికొంతమంది కోహ్లీకి మద్దతుగా నిలుస్తున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్ నుంచి మాత్రం కోహ్లీ గట్టి మద్దతు లభిస్తుంది. కోహ్లీ రెండోసారి డకౌట్ అయిన తర్వాత.. పాకిస్థాన్ ట్విట్టర్‌లో విరాట్ కోహ్లీ గోట్(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్ చేశారు. దీంతో కోహ్లీకి పాక్‌లో ఉన్న ఫ్యాన్స్ బేస్ గురించి మరోసారి ప్రపంచానికి తెలిసిందే. అభిమానం అంటే విజయంలోనే కాదు.. అపజయాల్లో కూడా మద్దతుగా ఉండేదని కోహ్లీ పాకిస్థాన్ ఫ్యాన్స్ నిరూపిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ డకౌట్లపై ఫ్యాన్స్ సెటైరికల్ మీమ్స్!
#ViratKohli𓃵 #BabarAzam𓃵 both are the goat
Like for kohli❤
Retweet for babar🔄 pic.twitter.com/VqZ22hwmmm— Masab Ghumman (@masab_rehmani_5) April 24, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.